Begin typing your search above and press return to search.

హృతిక్ రోషన్ 'ఫైటర్'.. కేవలం అక్కడి వరకేనా..

పాన్ ఇండియా ట్రెండ్ వచ్చినప్పటి నుంచి బాలీవుడ్లో కొందరు స్టార్ హీరోల సినిమాలను ఇతర భాషల్లో డబ్బింగ్ వర్షన్ తో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Dec 2023 3:00 AM GMT
హృతిక్ రోషన్ ఫైటర్.. కేవలం అక్కడి వరకేనా..
X

పాన్ ఇండియా ట్రెండ్ వచ్చినప్పటి నుంచి బాలీవుడ్లో కొందరు స్టార్ హీరోల సినిమాలను ఇతర భాషల్లో డబ్బింగ్ వర్షన్ తో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ 'యానిమల్' నార్తోపాటు సౌత్ అన్ని భాషల్లో దుమ్ము లేపుతుంది. దాని కంటే ముందు వచ్చిన షారుక్ 'జవాన్' కూడా తెలుగు, తమిళ భాషల్లో అదరగొట్టింది. అలా బాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ తమ సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తుంటే..

హృతిక్ రోషన్ మాత్రం తన కొత్త సినిమాని కేవలం హిందీలోనే విడుదల చేస్తుండటం ఆశ్చర్యంగా మారింది. బాలీవుడ్ టాప్ స్టార్స్ అందరిలో ముందు వరుసలో ఉండే హీరో హృతిక్ రోషన్. ఈయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఫైటర్'. బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. నిన్ననే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ ని అందుకోవడంతోపాటు సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

అత్యంత భారీ బడ్జెట్తో స్పై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు దీపికా పదుకొనే, సీనియర్ హీరో అనిల్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా టీజర్ ని విడుదల చేసిన మూవీ టీం సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నట్లు ఎక్కడా రివీల్ చేయలేదు. దాంతో ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న ఇతర భాషల ఆడియన్స్ కి ఇది డిసప్పాయింట్ గా మారింది

గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన 'వార్' మూవీ హిందీ సహా తెలుగులో కూడా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంది. అలాగే హృతిక్ నటించిన 'బ్యాంగ్ బ్యాంగ్' కూడా తెలుగులో విడుదలైంది. కానీ ఈ హీరో లేటెస్ట్ మూవీ 'ఫైటర్' మాత్రం హిందీలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అంతా ఇండియన్ సినిమా ఒకటే అన్నట్టుగా మేకర్స్ ఒక భాష నుంచి మరో భాషకి సినిమాలు రిలీజ్ చేస్తుంటే హృతిక్ రోషన్ మాత్రం ఈసారి అలాంటి స్టెప్ తీసుకోకపోవడం షాకింగ్ గా మారింది.

అసలు బాలీవుడ్ సినిమాలను తెలుగు ఆడియన్స్ కి అలవాటు చేసిందే హృతిక్ రోషన్. అతను నటించిన క్రిష్ ఫ్రాంచైజీ తోనే బాలీవుడ్ మూవీస్ కి తెలుగులో క్రేజ్ వచ్చింది. అలాంటి ఈ హీరో తన కొత్త సినిమాని ఒక్క హిందీ భాషలోనే రిలీజ్ చేస్తూ ఉండడం పాన్ ఇండియా ఆడియన్స్ కి ప్రధానంగా తెలుగు ఆడియన్స్ కి తీవ్ర నిరాశను కలిగిస్తోంది. ఎలాగో రిలీజ్ కి టైం ఉంది కాబట్టి అప్పటిలోపైనా మూవీ టీం హిందీ తో పాటు కనీసం తెలుగులో అయినా రిలీజ్ చేస్తారేమో చూడాలి.