Begin typing your search above and press return to search.

అంద‌మైన హీరోయిన్ కు గురువుగా గ్రీకువీరుడా?

అలియా భ‌ట్, శార్వ‌రీ వాఘ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో య‌శ్ రాజ్ ఫిలింస్ తొలి లేడీ ఓరియేంటెడ్ స్పై చిత్రాన్ని 'ఆల్పా' టైటిల్ తో తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 Aug 2024 6:52 AM GMT
అంద‌మైన హీరోయిన్ కు గురువుగా గ్రీకువీరుడా?
X

అలియా భ‌ట్, శార్వ‌రీ వాఘ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో య‌శ్ రాజ్ ఫిలింస్ తొలి లేడీ ఓరియేంటెడ్ స్పై చిత్రాన్ని 'ఆల్పా' టైటిల్ తో తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి శివ్ రావెల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే మొద‌టి షెడ్యూల్ కూడా పూర్త‌యింది. త్వ‌ర‌లో క‌శ్మీర్ లో రెండ‌వ షెడ్యూల్ మొద‌లువుతుంది. ఇందులో కీల‌క‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాలు తెర‌కెక్కించ‌న‌న్నారు. ఇందులో అలియాభ‌ట్, శార్వ‌రీ వాఘ్ స‌హా కీల‌క న‌టులంతా పాల్గొంటారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా సినిమా గురించి మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం లీకైంది. ఆల్పాలో అలియాభ‌ట్ కి గురువు పాత్ర‌లో బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోష‌న్ న‌టిస్తున్నారుట‌. గురువు పాత్ర‌కు ఓస్టార్ హీరో అయితే బాగుంటుంద‌ని ద‌ర్శ‌కుడు శివ్ రావెల్ భావించి హృతిక్ ని ఒప్పించిన‌ట్లు స‌మాచారం. య‌శ్ రాజ్ ఫిలింస్ తో హృతిక్ కి ఉన్న అనుబంధం కార‌ణంగా మ‌రో ఆలోచ‌న లేకుండా చేస్తాన‌ని ప్రామిస్ చేసారుట‌.

యాక్ష‌న్ సినిమాల‌కు హృతిక్ పెట్టింది పేరు. వాటిలో తానో బ్రాండ్ అని ఎప్పుడో ప్రూవ్ చేసాడు. అయితే స్పై జాన‌ర్ సినిమాలు చాలా త‌క్కువ‌గానే చేసాడు. ఆల్పాతో ఆ కోరిక కొంత‌వ‌ర‌కూ తీరుతుంద‌ని చెప్పొ చ్చు. అయితే అలియాభ‌ట్ లాంటి అంద‌మైన హీరోయిన్ స‌ర‌స‌న హృతిక్ ని హీరోగా ఊహించుకోగ‌లం కానీ, ఇలా గురువు పాత్ర‌లో కాదంటూ నెటి జ‌నులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కానీ అందుకు స‌మ‌యం ఉంది.

స‌రైన క‌థ కుదిరితే అందుకు ఆ కోరిక తీరుతుంది. హృతిక్ పాత్ర‌కి సింబాలిక్ గా గ‌తంలోనే అలియాభ‌ట్ చిన్న హింట్ ఇచ్చింది. టైటిల్ గురించి రివీల్ చేస్తూ ` గ్రీకు భాష‌లో మొదటి అక్ష‌రం మానినాదం అల్పా. ఇది అత్యంత వేగ‌మైన‌ది, శ‌క్తివంత‌మైన‌ది. ప్ర‌తీ దేశం ఒక అర‌ణ్యం లాంటిదే. దాన్ని పాలించ‌డానికే వ‌స్తోంది ఆల్పాగాళ్స్` అని తెలిపింది.