ఆపిల్ చేసిన చెత్త పనికి స్టార్ హీరో ఫైరింగ్
ఇప్పుడు బాలీవుడ్ కండల హీరో హృతిక్ రోషన్ కూడా దానిపై స్పందించారు.
By: Tupaki Desk | 11 May 2024 5:13 PM GMTఆపిల్ కొత్త ఐఫోన్ ప్రకటన చాలా మందిని నిరాశపరిచింది. ఈ వాణిజ్య ప్రకటనపై ఇప్పటికే ఆన్‌లైన్‌లో చర్చ ప్రారంభం కాగా.. చాలా మంది సెలబ్రిటీలు దీనిని అజ్ఞానం అని తిట్టారు. ఇప్పుడు బాలీవుడ్ కండల హీరో హృతిక్ రోషన్ కూడా దానిపై స్పందించారు. ఇటీవల హృతిక్ రోషన్ వివాదాస్పద ఆపిల్ ప్రకటనపై తన ఇన్ స్టాలో అభిప్రాయం తెలిపారు. అతడు దానిపై సీరియస్‌గా స్పందిస్తూ, ''కొత్త ఆపిల్ ప్రకటన ఎంత విచారకరం.. అజ్ఞానం'' అని రాశారు.
హృతిక్ కంటే ముందు, బ్రిటీష్ నటుడు హ్యూ గ్రాంట్ ఆపిల్ ప్రకటనపై సీరియస్ అయ్యారు. ``మానవ అనుభవాల విధ్వంసం`` అని రాసారు. నటుడు గ్రాంట్ మాత్రమే కాదు, బ్రిటిష్ దర్శకనిర్మాత ఆసిఫ్ కూడా ఈ వాణిజ్య ప్రకటనను నిందించారు. ఐప్యాడ్‌ల మాదిరిగానే ఉంది.. కానీ ఈ ప్రకటన సరైన ఆలోచన అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
ఈ నెల ప్రారంభంలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ `క్రష్` పేరుతో కొత్త ఆపిల్ ప్యాడ్ కి సంబంధించిన ప్రకటనను విడుదల చేశారు. కమర్షియల్ వీడియోలో సంగీత వాయిద్యాలు, శిల్పాలు, స్పీకర్లు, పుస్తకాలు, పెయింట్ డబ్బాలు, గేమింగ్ కన్సోల్ లు సహా అనేక వస్తువులను రోడ్ రోలర్ అణచి వేసినట్టు ఆపిల్ అణచివేస్తోంది. ఎత్తు నుంచి దూసుకొచ్చే హైడ్రాలిక్ లుక్ ని ఆవిష్కరించారు.
కొత్త ఐఫోన్‌ను అత్యంత శక్తివంతంగా, సన్నగా చూపించాలనేది కంపెనీ ఆలోచన.. అయినప్పటికీ అది ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు. ఆపిల్ ఇతర సాంకేతిక ఉపకరణాలను అగౌరవపరిచిందని చాలా మంది ఆరోపించారు. మరికొందరు ప్రకటనలోని ``అణచివేత ధోరణి`పై నిరాశను వ్యక్తం చేశారు. ఈ ఎదురు దెబ్బ తర్వాత యాపిల్ టెలివిజన్‌లో తన కొత్త వాణిజ్య ప్రకటనను విడుదల చేయకూడదని నిర్ణయించుకుంది.