Begin typing your search above and press return to search.

హృతిక్ రోష‌న్ 3 గంట‌ల‌కు ఒక‌సారి తింటారా?

అంతేకాదు ఫుడ్ విష‌యంలో క‌ఠిన నియ‌మాలు ఆచ‌రిస్తారు. తాజాగా ప్ర‌యాణాల్లో హృతిక్ ఎలాంటి ఆహారం తీసుకుంటారో? ఇన్ స్టాలో రివీల్ చేసారు.

By:  Tupaki Desk   |   27 Sep 2023 2:45 AM GMT
హృతిక్ రోష‌న్ 3 గంట‌ల‌కు ఒక‌సారి తింటారా?
X

నాగార్జున గ్లామ‌ర్ సీక్రెట్ వాట‌ర్ అంటారు. ఎక్కువ‌గా మంచినీళ్లు తాగ‌మంటారు. క‌నీసం అర‌గంట‌కు ఒక‌సారైనా గ్లాస్ వాట‌ర్ తీసుకోవ‌డం అన్న‌ది ఆయ‌న షెడ్యూల్ లో ఉంటుంది. ఇంకా టైమ్ టైమ్ డైట్ ఉంటుంది. సాయంత్రం ఆరు గంట‌ల‌కే డిన్న‌ర్ పూర్త‌వుతుంది. మెగాస్టార్ చిరంజీవి డైట్ విష‌యంలో కూడా ఓ ప్లానింగ్ అంటూ ఉంటుంది. టైమ్ టూ టైమ్ అన్ని తీసుకుంటారు. అన్నింటికి మంచి నిద్ర అనేది స‌వ్యంగా ఉండేలా చూసుకోమ‌ని ఎక్కువ‌గా చెబుతుంటారు.

ఇలా ఇన్ని చేస్తారు? కాబట్టే 60 ఏళ్ల పైబ‌డినా...తాత‌య్య వ‌య‌సులు వ‌చ్చినా! అదే ఎన‌ర్జీతో ప‌నిచేయ‌గ ల్గుతున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ ఏజ్ 49..మ‌రో ఏడాది 50వ ప‌డిలోకి అడుగు పెడ‌తారు. ఇక ఆయ‌న శ‌రీర సౌష్ట‌వం..రూపం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న ఫిజిక్ చూస్తే మ‌తి పొతుంది. మెలితిరిగిన కండ‌లు...ముఖంలో తేజ‌స్సు చూస్తే హీరో అంటే ఇలా ఉండాలి అనిపిస్తాడు.

అత‌డు ఎంతో మంది హీరోల‌కు రోల్ మోడ‌ల్ లాంటి వారు. హృతిక్ ని అభిమానించే హీరోలెంతో మంది ఉన్నారు. మ‌రి 50 ఏళ్ల‌కు చేరువ‌లో ఉన్నా! హృతిక్ ఇప్ప‌టికీ అలాగే ఉన్నాడు? అంటే దాని వెనుక ఎంతో శ్ర‌మ కూడా ఉంద‌ని గుర్తించాలి. ఆయ‌న వ‌ర్కౌట్లు ఎలా చేస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు. జిమ్ములో గంట‌ల కొద్ది శ్ర‌మిస్తారు. జిమ్ సెష‌న్ పూర్తయ్యే వ‌ర‌కూ మ‌రో ఆలోచ‌న రాదు. ఇప్ప‌టికీ శ‌రీర సౌష్ట‌వం అలా ఉందంటే? కారణం నిత్యం వ‌ర్కౌట్లు చేయ‌డం వ‌ల్లే.

అంతేకాదు ఫుడ్ విష‌యంలో క‌ఠిన నియ‌మాలు ఆచ‌రిస్తారు. తాజాగా ప్ర‌యాణాల్లో హృతిక్ ఎలాంటి ఆహారం తీసుకుంటారో? ఇన్ స్టాలో రివీల్ చేసారు. హృతిక్ బ్లాక్ కంటైన‌ర్‌లో గ్రీన్ క్యాప్సిక‌మ్‌, ట‌మాట ముక్క‌లు, చిన్న టిక్కీ త‌ర‌హా ఫుడ్ ఐటెమ్స్ క‌నిపించాయి.

ఈ టిక్కాలు ప్రొటీన్ల‌తో నిండిఉన్నాయ‌ని క్యాప్ష‌న్‌లో హృతిక్ హింట్ ఇచ్చాడు. త‌న ల‌గేజ్‌లో ఆరు బాక్సులు ఉంటాయ‌ని, ప్ర‌తి మూడు గంట‌లకు ఒక‌సారి తాను తీసుకునే భోజ‌నంలో 130 గ్రాముల (కుక్డ్ వెయిట్‌) ప్రొటీన్‌తో పాటు కూర‌గాయ‌లు ఉంటాయట‌. ఈ ఆహారం ఇంట్లో త‌యారు చేసింద‌ని క్యాప్ష‌న్‌లో రాసుకొచ్చాడు. ఇంట్లో త‌యారుచేసి చ‌ల్ల‌గా ఉన్న ఆహార ప‌దార్ధాల‌నే తీసుకుంటారు.