'టాప్ గన్' ఛాయలో ఫైటర్
బాలీవుడ్ పై హాలీవుడ్ ప్రభావం ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. మేకింగ్ పరంగా బాలీవుడ్ మేకర్లు అక్కడ నుంచి స్పూర్తి పొందుతారు.
By: Tupaki Desk | 9 Dec 2023 6:19 AMబాలీవుడ్ పై హాలీవుడ్ ప్రభావం ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. మేకింగ్ పరంగా బాలీవుడ్ మేకర్లు అక్కడ నుంచి స్పూర్తి పొందుతారు. కాన్సెప్ట్ ని బట్టి మేకింగ్ స్టైల్ ఆధారపడి ఉంటుంది. ఇండియాలో బాలీవుడ్ అంతగా ఫేమస్ అయిందంటే? ప్రధాన కారణాల్లో ఇదొకటిగా చెప్పొచ్చు. యాక్షన్ థ్రిల్లర్ అయినా...హారర్ థ్రిల్లర్ అయినా...డ్రామా అయినా అడ్వాన్స్డ్ డ్ గా చెప్పే ప్రయత్నం అన్నది చాలా కాలంగా చూస్తున్నదే.
మిగతా భాషల నుంచి బాలీవుడ్ ని అందుకే సపరేట్ చేస్తుంది. అందులోనూ హృతిక్ రోషన్ సినిమాలపై బాలీవుడ్ ప్రభావం మరింత బలంగా ఉంటుందని అతని గత చిత్రాలెన్నో నిరూపించాయి. తాజాగా సిద్దార్ధ్ ఆనంద్ తెరకెక్కిస్తోన్న `ఫైటర్` పై కూడా ఆ ప్రభావం స్పష్టంగా ఉందని తెలుస్తోంది. హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఆకాశంలో వార్ నేపథ్యం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. ఇంతవరకూ సముద్రగర్భంలో...భూమ్మీద మాత్రయే దేశ భక్తి నేపథ్యంలో వార్ సినిమాలొచ్చాయి. కానీ ఫైటర్ ఓ కొత్త అనభూతిని పంచబోతుంది. ఆకాశంలో జెట్ ల మధ్య ఎలాంటి వార్ జరగబోతుందో? ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఆకాశంలో ఇంత పెద్ద భారీ కాన్సాస్ పై ఇంతవరకూ ఏ సినిమా చేయ లేదు. స్పేస్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని కథలొచ్చాయి గానీ వాటికి ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదు.
ఇది పూర్తిగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చెబుతోన్న స్టోరీ. కథ మొదలు నుంచి ముగింపు వరకూ అంతా వార్ సన్నివేశాలన్ని ఆకాశంలో ఓ ప్రత్యేక పొరలోనే ఉంటాయి. ఈ సినిమాపై హాలీవుడ్ చిత్రం `టాప్ గన్` ఛాయలో కనిపిస్తున్నాయి. టీజర్ అనంతరం టాప్ గనతో పోల్చుతున్నారు. విజువల్ గా సినిమా హైలైట్ అవుతుంది. ఇంకా ట్రైలర్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. అది కూడా మార్కెట్ లోకి వస్తే ఫైటర్ పై అంచనాలు అంతకంతకు పెరిగిపోతాయి.
దీపికా పదుకొణే గ్లామర్ సినిమాకి అదనపు అస్సెట్ గా కనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాల్లోనూ అమ్మడు ఏమాత్రం తగ్గలేదు. ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా వచ్చే ఏడాది జనవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నారు. ఇటీవలే చిత్రీ కరణ పూర్తిచేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ల్లో ఉంది. అలాగే హృతిక్ రోషన్ అతి త్వరలోనే `వార్-2` షూట్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు.