Begin typing your search above and press return to search.

మాజీకి హీరోగారు లైక్..ఇంట్రెస్టింగ్!

తాజాగా కంగ‌నకి మ‌ద్ద‌తుగా హృతిక్ రోష‌న్ కూడా నిలిచాడు. ఆమె చేసిన పోస్టుల‌కు లైక్ లు ఇచ్చి నా మాద్ద‌తు నీకే అనేసాడు.

By:  Tupaki Desk   |   10 Jun 2024 4:24 AM GMT
మాజీకి హీరోగారు లైక్..ఇంట్రెస్టింగ్!
X

బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ ని కంగ‌న ఎంత‌గా ద్వేషిస్తుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రు కొన్నాళ్ల పాటు స‌హ జీవ‌నం చేయ‌డం..అటుపై తేడాలొచ్చి విడిపోవ‌డం తెలిసిందే. అక్క‌డ నుంచి హృతిక్ అంటే అమ్మ‌డు అగ్గిమీద గుగ్గిల‌మ‌వుతుంది. హృతిక్ పై ఎన్నో సార్లు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. అత‌డి ఇమేజ్ ని డ్యామేజ్ చేయాల‌ని ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసింది. వృత్తి, వ్య‌క్తిగ‌తంగా హృతిక్ ని ఓ రేంజ్ లో చెడుగుడు ఆడుకుంది.

కానీ ఏ నాడు హృతిక్ రోష‌న్ మాత్రం కంగ‌నని ఒక్క మాట కూడా అన‌లేదు. ఏనాడు విమ‌ర్శ చేసింది లేదు. అలా హృతిక్ రోష‌న్ కామ్ గా ఉన్నా? సందు చిక్కిన‌ప్పుడ‌ల్లా క్వీన్ మాత్రం విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉంది. అలాంటి కంగ‌న‌పై హృతిక్ ఎలా రియాక్ట్ అయ్యాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. రైతు ఉద్య‌మం నేప‌థ్యంలో రైతుల‌పై కంగ‌న రియాక్ష‌న్ ఏ స్థాయికి చేరిందో తెలిసిందే. చివ‌రికి ఎంపీ అయిన త‌ర్వాత లేడీ కానిస్టేబుల్ చేతిలో లెంప‌కాయ తినాల్సి కూడా వ‌చ్చింది.

ఈ వివాదంపై కంగ‌న పోస్టులు అంతే ఆస‌క్తిక‌రంగా మారాయి. వీటిపై కొంద‌రు సెల‌బ్రిటీలంతా ఆమెకి మ‌ద్ద‌తునివ్వ‌గా ..నెటి జ‌నులు మాత్రం మంచి పని జ‌రిగింద‌ని సంబ‌ర‌ప‌డ్డారు. తాజాగా కంగ‌నకి మ‌ద్ద‌తుగా హృతిక్ రోష‌న్ కూడా నిలిచాడు. ఆమె చేసిన పోస్టుల‌కు లైక్ లు ఇచ్చి నా మాద్ద‌తు నీకే అనేసాడు. ఆ ర‌కంగా కంగ‌న తీరులో ఎలాంటి త‌ప్పు లేద‌ని చెప్ప‌క‌నే చెప్పాడు. కంగ‌న‌కి జ‌రిగిన అవ‌మానంపై అలియాభ‌ట్, సోనాక్షి సిన్హా, అర్జున్ క‌పూర్ స‌హా చాలి మంది సెల‌బ్రిటీలు చెంప‌ దెబ్బ‌ను ఖండించారు.

తాజాగా మాజీ ప్రియుడు కూడా వాళ్ల‌ని స‌మ‌ర్ధించాడు. ప్రస్తుతం హృతిక్ లైక్ బాలీవుడ్ లో సైతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అంత‌గా అవ‌మ‌నించిన కంగ‌న‌కి హృతిక్ అండ‌గా నిల‌బ‌డ‌టం షాకింగ్ గా ఉందంటున్నారు. హృతిక్ అభిమానులైతే మీరు చేసిన ప‌ని బాగోలేద‌ని నిర్మొహ‌మాటంగానే చెప్పేస్తున్నారు.