ఫైటర్ ఇలా రిలీజ్ కి ముందే బట్టలిప్పేస్తే ఎలా?
బాలీవుడ్ కండల హీరో హృతిక్ రోషన్ ఫిట్ నెస్ విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తారో చెప్పాల్సిన పనిలేదు
By: Tupaki Desk | 19 Aug 2023 6:09 AM GMTబాలీవుడ్ కండల హీరో హృతిక్ రోషన్ ఫిట్ నెస్ విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తారో చెప్పాల్సిన పనిలేదు. రోజుకు 3గం.లు కేవలం జిమ్ కే కేటాయించే ఏకైక హీరో. అధిక సమయాన్ని జిమ్ములోనే గడుపుతారు. బాడీని విల్లులా వంచే హీరో అతను. అద్భుతమైన శరీర సౌష్టవంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు. తాజాగా హృతిక్ జిమ్ నుంచి ఓ కొత్త ఫోటోని అభిమానుల కోసం షేర్ చేశారు. అందులో హృతిక్ కండలు చూపించి ఫిదా చేసారు.
'ఫైటర్' స్టార్ హృతిక్ తన టోన్డ్ బైసప్స్ తో సూపర్బ్ గా కనిపిస్తున్నారు. మరి ఈ పిక్ వెనుక హృతిక్ ఫిట్ నెస్ మంత్రం ఒక్కటే ఉందా? సినిమా కథ కూడా ఉందా? అంటే సినిమా అనె చెప్పాలి. ప్రస్తుతం హృతిక్ రోషన్- సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో' ఫైటర్' అనే భారీ యాక్షన్ చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో నయా స్టార్ బాడీ బిల్డర్ గా మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిగా కనిపించనున్నారు.
ప్రస్తుతం సినిమా సెట్స్ లో ఉంది. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హృతిక్ సినిమా షూటింగ్ ఉన్నంత కాలం డైలీ చేసే జిమ్ముతో పాటు అదనంగా శ్రమించక తప్పదు. మామూలు సినిమాల్లోనే హృతిక్ సూపర్ బాడీ తో అదరగొడతారు. ఫైటర్ లాంటి యాక్షన్ సినిమా ..అందులోనూ మార్షల్ ఆర్స్ట్ కి సంబంధించిన స్టోరీ కాబట్టి హృతిక్ తనని తాను ఎలా మలుచుకుంటాడో చెప్పాల్సిన పనిలేదు.
ఆ సినిమాకే వన్నె తీసుకొచ్చేలా హృతిక్ ప్రతీ విషయంలో కేర్ తీసుకుంటారు. అందులో బాడీలుక్ పరంగా ప్రత్యేకంగా సన్నదం అవుతున్నారు. అందు కోసమే ఇలా కఠోరంగా శ్రమిస్తున్నారు. బ్లాక్ షార్ట్ ధరించి....నెత్తికి రెడ్ కలర్ క్యాప్ ధరించి జిమ్ లొదిగిన ఫోటో ఇది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. హృతిక్ శరీర శైలిపై అభిమానుల కామెంట్లు ఆసక్తికరం. అందులోనూ గాళ్స్ గాంగ్ కామెంట్లు సమ్ థింగ్ స్పెషల్ గా హైలైట్ అవుతున్నాయి.