Begin typing your search above and press return to search.

క్లైమాక్స్ లో 'ఫైట‌ర్'.. తార‌క్ సిద్దమ‌వ్వాల్సిందే!

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోష‌న్-టాలీవుడ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో 'వార్ -2' తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   28 Aug 2023 5:59 AM GMT
క్లైమాక్స్ లో ఫైట‌ర్.. తార‌క్ సిద్దమ‌వ్వాల్సిందే!
X

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోష‌న్-టాలీవుడ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో 'వార్ -2' తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సీక్వెల్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఆయాన్ ముఖ‌ర్జీ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించ‌బోతున్నారు. మ‌రి ఈ సినిమా ప్రారంభోత్స‌వానికి స‌మ‌యం ఆస‌న్న‌మైందా? యుద్ద భూమిలో ఎదురుచూస్తోన్న హృతిక్ ఎదురు చూపుల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డిందా? అంటే అవున‌నే తెలుస్తోంది.

ప్ర‌స్తుతం హృతిక్ రోష‌న్ 'ఫైట‌ర్' లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని నెల‌లుగా సెట్స్ లో ఉన్న సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. తాజాగా ఈ సినిమా చివ‌రి షెడ్యూల్ ముంబైలో ప్రారంభం కానుంది. ముంబైలో వారం రోజుల పాటు హృతిక్- అనీల్ క‌పూర్ మ‌ధ్య యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారు. అటుపై బాస్కో సీజ‌న్ నృత్య ద‌ర్శ‌క‌త్వంలో హృతిక్-దీపికా ప‌దుకొణే ల‌పై ఓ ప్ర‌త్యేక పాట‌ని చిత్రీక‌రిస్తారు. దీంతో షూటింగ్ దాదాపు పూర్త‌యిన‌ట్లే. అటుపై ప్యాచ్ వ‌ర్క్ మొద‌ల‌వుతుంది.

అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే వార్ -2 చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాల‌ని హృతిక్ భావిస్తున్నారుట‌. ఆయ‌న‌కు వేర్వేరు క‌మిట్ మెంట్లు ఉన్నా! ముందుగా పూర్తి చేయాల్సిన సినిమా ఇదేన‌ని భావిస్తున్నారుట‌. ఇదే నిజ‌మైతే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా అందుకు సిద్ద‌మ‌వ్వాల్సిందే. యుద్ద భూమిలో తార‌క్ కోసం ఎదురుచూస్తున్న‌ట్లు హృతిక్ రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే.

సినిమాలో ఎన్టీఆర్ భాగ‌మ‌వ్వ‌డంతో 'వార్ -2' రేంజ్ ఒక్క‌సారిగా మారిపోయింది. తార‌క్ ది నెగిటివ్ రోలా? హీరో పాత్ర అన్న‌ది క్లారిటీ లేదు. కానీ పాన్ ఇండియా రిలీజ్ గా తేల్చాల్సి వ‌చ్చింది. తార‌క్ డేట్లు కేటాయిస్తే? దేవ‌ర తో పాటు 'వార్ -2' షూటింగ్ కూడా హాజ‌ర‌వ్వాల్సి వ‌స్తుంది. 'దేవ‌ర' కూడా ఇప్ప‌టికిప్పుడు పూర్తి చేసే ప్రాజెక్ట్ కాదు. నెమ్మ‌ది షూటింగ్ చేస్తున్నారు. వ‌చ్చే ఏడాది రిలీజ్ కాబ‌ట్టి అందుకు త‌గ్గ‌ట్లు ఓ ప్లానింగ్ ప్ర‌కారం ముందుకెళ్తున్నారు. ఈ క్ర‌మంలో ఎన్టీఆర్ కి కూడా స‌మ‌యం దొరుకుతుంది. ఈ నేప‌థ్యంలో ఆ వ్య‌వ‌ధిలో టైగ‌ర్ వార్ -2 సెట్స్ కి హాజ‌రయ్యే అవ‌కాశం ఉంది.