Begin typing your search above and press return to search.

దేవర విషెష్‌ కి ఫైటర్‌ సూపర్ రిప్లై

దేవర గ్లిమ్స్ చాలా బాగుంది. గుడ్ లక్.. సీయూ సూన్ అంటూ త్వరలోనే వార్‌ 2 సినిమా షూటింగ్‌ లో కలుద్దాం అన్నట్లుగా సూపర్‌ రిప్లై ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   12 Jan 2024 6:55 AM GMT
దేవర విషెష్‌ కి ఫైటర్‌ సూపర్ రిప్లై
X

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్ పుట్టిన రోజు సందర్భంగా యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ఎక్స్ ద్వారా బర్త్‌ డే విషెష్‌ చెప్పిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్ వంటి స్టార్‌ శుభాకాంక్షలు చెబితే హృతిక్ రోషన్‌ స్పందించక పోవడం పై నందమూరి అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

రెండు రోజుల ఆలస్యంగా హృతిక్‌ నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ బర్త్‌ డే శుభాకాంక్షలకు హృతిక్ స్పందిస్తూ... థాంక్యూ సో మచ్ తారక్‌. దేవర గ్లిమ్స్ చాలా బాగుంది. గుడ్ లక్.. సీయూ సూన్ అంటూ త్వరలోనే వార్‌ 2 సినిమా షూటింగ్‌ లో కలుద్దాం అన్నట్లుగా సూపర్‌ రిప్లై ఇచ్చాడు.

వీరిద్దరి కాంబోలో వార్ 2 రాబోతున్న విషయం తెల్సిందే. అందుకే వీరిద్దరు ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా సోషల్‌ మీడియా ద్వారా ఒకరిని ఒకరు పలకరించుకుంటున్నట్లుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ఈ ఏడాది సమ్మర్ నుంచి వార్‌ 2 సినిమా షూటింగ్‌ కోసం వీరు కలువబోతున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ దేవర సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఏప్రిల్‌ లో దేవర సినిమా విడుదల అవ్వబోతుంది. ఇక ఫైటర్ సినిమా తో హృతిక్ రోషన్ పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. వీరిద్దరూ ప్రస్తుత సినిమాలు విడుదల అవ్వడమే ఆలస్యం వార్ 2 మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.