Begin typing your search above and press return to search.

హృతిక్ (X) సుశానే: మాజీల హుందాత‌నం ఔరా!

అర్స్లాన్ సుస్సానేతో కలిసి విహార‌యాత్ర‌ల‌కు వెళ్లిన‌ప్ప‌టి ఫోటోల‌ను షేర్ చేసారు. పుట్టినరోజు శుభాకాంక్షలు నా ప్రేమ ..అన్నింటిలో మొదటిది, నేను ప్రస్తుతం మీతో లేనందుకు చాలా చింతిస్తున్నాను.

By:  Tupaki Desk   |   28 Oct 2023 4:15 AM GMT
హృతిక్ (X) సుశానే: మాజీల హుందాత‌నం ఔరా!
X

అత‌డు ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ సెల‌బ్రిటీ క‌పుల్ కి ఇద్ద‌రు పిల్ల‌లు. కానీ రెండు ద‌శాబ్ధాల సుదీర్ఘ జీవ‌నం త‌ర్వాత ఆ కాపురంలో క‌ల‌త‌లు వ‌చ్చాయి. ఇద్ద‌రూ అధికారికంగా విడిపోయారు. కానీ బ్రేక‌ప్ త‌ర్వాత ఎంతో స్నేహంగా ఉండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు స‌హ త‌ల్లిదండ్రులుగా ఆ ఇద్ద‌రూ ఆద‌ర్శ‌జీవ‌నం సాగిస్తున్నారు. ఇప్పుడు ఎవ‌రి దారిలో వారు కొత్త భాగ‌స్వాముల‌తో జీవ‌నం సాగిస్తున్నారు. అంతేకాదు.. కొత్త భాగ‌స్వాముల విష‌యంలో మాజీల ప్ర‌వ‌ర్త‌న కూడా అంతే హుందాగా ఉంది. ఇది ఎంతో ఉన్న‌త‌మైన‌ది. ఆద‌ర్శ‌నీయ‌మైన‌ది.

ఇదంతా హృతిక్ రోష‌న్- సుశానే ఖాన్ జంట గురించే. ఆ ఇద్ద‌రూ చిన్న‌నాటి స్నేహితులు. ప్రేమించి పెద్ద‌ల్ని ఒప్పించి పెళ్లాడారు. ఇద్ద‌రికి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. కానీ ఇప్పుడు విడిపోయి ఎవ‌రి దారిలో వారు కొత్త భాగ‌స్వాముల‌తో ఉన్నారు. సుస్సాన్ ఖాన్ ప్ర‌ముఖ బిజినెస్ మేన్ అర్ల్సాన్ గోనితో స‌హ‌జీవ‌నంలో ఉన్నారు. హృతిక్ రోష‌న్ గాయ‌ని కం న‌టి స‌బా అజాద్ తో సంబంధంలో ఉన్నారు. అయినా మాజీలు ఒక‌రికొక‌రు విషెస్ చెప్పుకుంటూ ఎప్ప‌టిక‌ప్ప‌డు సోష‌ల్ మీడియాల్లో ట‌చ్ లోనే ఉన్నారు. త‌మ పిల్ల‌ల కోసం క‌లుస్తూనే ఉన్నారు. ఇప్పుడు సుశానే 48వ పుట్టినరోజు సందర్భంగా, ప్రియుడు అర్స్లాన్ గోని ఇన్‌స్టాగ్రామ్‌లో హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. త‌మ మ‌ధ్య అనుబంధంపై అంద‌మైన‌ జ్ఞాపకాలను అభిమానుల‌కు షేర్ చేసాడు. సుశానే మాజీ భర్త హృతిక్ రోషన్ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఈ స్పెష‌ల్ డేని అద్భుతంగా సెల‌బ్రేట్ చేసుకున్నారు.

అర్స్లాన్ సుస్సానేతో కలిసి విహార‌యాత్ర‌ల‌కు వెళ్లిన‌ప్ప‌టి ఫోటోల‌ను షేర్ చేసారు. పుట్టినరోజు శుభాకాంక్షలు నా ప్రేమ ..అన్నింటిలో మొదటిది, నేను ప్రస్తుతం మీతో లేనందుకు చాలా చింతిస్తున్నాను. కానీ మ‌నం మంచి జ్ఞాపకాలను సృష్టిస్తాము.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను... అని అత‌డు సోష‌ల్ మీడియాల్లో ఎమోష‌న‌ల్ గా వ్యాఖ్యానించాడు. సుస్సానే తన పోస్ట్‌కి ప్రత్యుత్తరం ఇస్తూ, "మై ల‌వ్ మై జానూ.. నువ్వే నా సర్వస్వం.. నేను ఈ గ్రహం మీద అత్యంత అదృష్టవంతురాలిని. ఈ విశ్వం నాకు ఉత్తమమైన బహుమతిని ఇచ్చింది... అది నువ్వు" అని వ్యాఖ్యానించింది. ఇంతలో హృతిక్ కూడా 'స్వీట్' (హార్ట్ ఎమోజి) హ్యాపీ బర్త్ డే గైస్! అని వ్యాఖ్యానించారు. రుచికా కపూర్ షేక్, ఫరా ఖాన్ అలీ, అభిషేక్ కపూర్ త‌దిత‌ర‌ స్నేహితులు సుస్సానేకి ఈ ప్రత్యేక రోజున శుభాకాంక్షలు తెలిపారు. ఆమె సోదరి ఫరా పార్టీ నుండి ర‌క‌ర‌కాల ఫోటోల‌ను షేర్ చేసింది.