హ్యాపీ హగ్ డే 2025.. కౌగిలింతకు అర్థం చెప్పిన స్టార్ కపుల్స్
ఫిబ్రవరి 12- హగ్ డే ప్రత్యేకత ఏమిటీ? అంటే...దీనికి సమాధానం ఇది.
By: Tupaki Desk | 12 Feb 2025 7:01 AM GMTఒక సాధారణ కౌగిలింత.. ఓదార్పునిచ్చే ఆప్యాయత, ప్రేమను చూపించడానికి వాలెంటైన్స్ వీక్‌లో కీలకం. ప్రేమ, సంరక్షణ, మద్దతు, భద్రత లాంటి భావాలు నిశ్శబ్దంగా కౌగిలింతల ద్వారా భాగస్వాముల్లో ఒకరినుంచి ఒకరికి అందుతాయి. ఈ రోజు ప్రేమ, సానుకూలతను అందరిలోకి ప్రసరింపజేయాలి.
ముఖ్యంగా ప్రేమికులు తమ భాగస్వామికి శృంగారభరితమైన కౌగిలింత ఇవ్వొచ్చు. కుటుంబ సభ్యునికి దార్పునిచ్చే కౌగిలింత.. స్నేహితుడికి వామ్ హగ్ ను ఇచ్చే రోజు ఇది. ఫిబ్రవరి 12- హగ్ డే ప్రత్యేకత ఏమిటీ? అంటే...దీనికి సమాధానం ఇది.
హగ్ అనేది భావోద్వేగానికి సంబంధించిన చర్య. ఒక అధ్యయనాల ప్రకారం.. హగ్ చేసుకోవడం వల్ల ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. దీనిని లవ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.. రక్తపోటును తగ్గిస్తుంది.. ఒకరికోసం ఒకరు అనే భావన వెయ్యి ఏనుగుల బలాన్ని అందిస్తుంది. ఒక సాధారణ హగ్ ఒకరి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, ఒంటరితనాన్ని తొలగిస్తుంది. సంబంధాలను బలపరుస్తుంది. 2025 హగ్ డే నాడు సెలబ్రిటీ కపుల్స్ హగ్ చర్చగా మారింది.
రణబీర్ కపూర్ - ఆలియా భట్ జంట తమ కుమార్తె రాహా కపూర్ తో కలిసి ఇదిగో ఇలా ఒక చెట్టుకు హగ్ ఇచ్చిన ఈ ఫోటోగ్రాఫ్ చూడగానే, `హగ్ డే` ప్రత్యేకత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఇది అరుదైన ఆప్యాయతతో కూడుకున్న స్పర్శ. ``మీ జాబితాలోని రెండవ వ్యక్తితో షేర్ చేసుకోండి -అందరికీ హ్యాపీ హగ్ డే!`` అంటూ ఆ కుటుంబం విషెస్ తెలిపింది. విక్కీ కౌశల్- కత్రిన కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా- కియరా అద్వాణీ, రణవీర్ సింగ్ - దీపిక పదుకొనే జంటలు ఇలా వెచ్చని కౌగిలింతతో హగ్ డే -2025 కి ప్రత్యేకతను ఆపాదించారు. ఒక వెచ్చని కౌగిలి చాలా ప్రశాంతతను, హాయిని ఇస్తుందని ఈ జంటలు చెప్పకనే చెబుతున్నారు. ఘాఢమైన రొమాన్స్ లో కౌగిలి పాత్రను కూడా వారి నులివెచ్చని హగ్ రివీల్ చేస్తోంది.