Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ సెట్ లో భారీ ప్రమాదం..!

బిగ్ బాస్ సీజన్ 8 కి సంబందించిన సెట్ కూడా ఈవీపీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 Sep 2024 7:16 AM GMT
బిగ్ బాస్ సెట్ లో భారీ ప్రమాదం..!
X

బిగ్ బాస్ సెట్ లో ప్రమాదం జరిగింది. ఐతే అది మన తెలుగు బిగ్ బాస్ సెట్ లో కాదు తమిళ్ బిగ్ బాస్ సెట్ లో ప్రమాదం జరిగినట్టు సమాచారం. తెలుగు బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేసి జరుగుతున్నట్టుగానే తమిళ్ బిగ్ బాస్ ను ఈవీపీ ఫిల్మ్ సిటీలో సెట్ వేస్తారు. ఆ స్టూడియోలో సీరియల్స్, సినిమాలు ఇలాంటి రియాలిటీ షోలు ఎన్నో జరుగుతాయి. బిగ్ బాస్ సీజన్ 8 కి సంబందించిన సెట్ కూడా ఈవీపీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ గార్డెన్ ఏరియా ఇదంతా సెపరేట్ సెట్ వర్క్ ఉంటుంది. ఐతే దీని కోసం అక్కడ కార్మీకులు డే అండ్ నైట్ కష్టపడి ఏర్పాటు చేస్తున్నారు.

ఐతే బిగ్ బాస్ సెట్ ఏర్పాటు చేస్తున్న టైం లో 20 అడుగుల ఎత్తు నుంచి ఒక వ్యక్తి పడిపోయాడట. అంత ఎత్తు నుంచి పడటంతో అతని చేయి ఇంకా తుంటి ఎముక విరిగినట్టు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లగా వైద్యులు కావాల్సిన ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై నసరత్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. బిగ్ బాస్ సెట్ ప్రాపర్టీస్ కోసం కొంతమందిని బిగ్ బాస్ టీం రిక్రూట్ చేసుకుంది.

ఐతే కిద పడిన వ్యక్తి ఉత్తరప్రదేశ్ కు చెందిన మహ్మద్ షాహిల్ ఖాన్ అని తెలుస్తుంది. అతని వయసు 46 ఏళ్లు. అక్టోబర్ 6 నుంచి తమిళ్ బిగ్ బాస్ సీజన్ 8 మొదలు కావాల్సి ఉంది. ఇప్పటికే ప్రోమోస్ రిలీజ్ చేశారు. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 7 వరకు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించారు. ఐతే ఈ సీజన్ కు హోస్ట్ ను మారుస్తున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 తమిళ్ హోస్ట్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని ఫిక్స్ చేశారు. బిగ్ బాస్ హోస్ట్ గా చేసేందుకు విజయ్ సేతుపతి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

మరి ఈ ప్రమాదం వల్ల బిగ్ బాస్ సీజన్ 8 అనుకున్న డేట్ కి ప్రారంభం అవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ సీజన్ 8 తమిళ్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ ఇప్పటికే కోలీవుడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆల్రెడీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 నాలుగో వారం నడుస్తుంది. తమిళ్ లో సీజన్ 8 విజయ్ సేతుపతి హోస్ట్ గా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని చెప్పొచ్చు.