Begin typing your search above and press return to search.

కల్కి - యానిమల్ ఎఫెక్ట్.. బడ్జెట్ తోనే షాక్ ఇచ్చేలా..

డార్లింగ్ ప్రభాస్ ఈ ఏడాది ‘కల్కి 2898ఏడీ’ తో పాన్ ఇండియా లెవల్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నారు.

By:  Tupaki Desk   |   19 Sep 2024 5:30 PM GMT
కల్కి - యానిమల్ ఎఫెక్ట్.. బడ్జెట్ తోనే షాక్ ఇచ్చేలా..
X

డార్లింగ్ ప్రభాస్ ఈ ఏడాది ‘కల్కి 2898ఏడీ’ తో పాన్ ఇండియా లెవల్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నారు. ఈ మూవీ 1100+ కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఈ ఏడాది ఇండియా నుంచి వచ్చిన సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా ‘కల్కి 2898ఏడీ’ మూవీ నిలిచింది. ఈ సినిమాని 600 కోట్ల బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ నిర్మించింది. సినిమాకి పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ పై కనిపించింది. ఈ సినిమా ఇంపాక్ట్ ప్రభాస్ నుంచి రాబోయే చిత్రాలపై కూడా పడిందనే మాట వినిపిస్తోంది.

హీరోలపై ప్రేక్షకుల ఎక్స్ పెక్టేషన్స్ సినిమా సినిమాకి పెరిగిపోతూ ఉంటాయి. కల్కి2898ఏడీ మూవీని ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కించి ప్రభాస్ ఇమేజ్ ని అమాంతం పెంచేశాడు. దీని తర్వాత డార్లింగ్ నుంచి రాబోయే సినిమాల విషయంలో ప్రేక్షకుల ఎక్స్ పెక్టేషన్స్ హై ఎండ్ లోనే ఉన్నాయి. వాటిని అందుకోవడానికి మేకర్స్ ముందు అనుకున్న బడ్జెట్ ల కంటే ఇంకా ఎక్కువ పెట్టుబడి కథలపై పెట్టాల్సి వస్తోంది. సీన్స్ అన్ని కూడా లార్జర్ దెన్ లైఫ్ ఉండేలా డిజైన్ చేయాలంటే కచ్చితంగా ఖర్చుకి వెనుకాడకూడదు.

ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆఖరులో మొదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. టి-సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాని ముందుగా 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి ఏకంగా 500 కోట్ల వరకు బడ్జెట్ పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారంట.

‘యానిమల్’ సినిమాతో సందీప్ రెడ్డి 900 కోట్ల కలెక్షన్స్ అందుకున్నారు. ‘కల్కి’ మూవీతో ప్రభాస్ 1000 కోట్ల క్లబ్ లో చేరాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్, సందీప్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని కాన్సెప్ట్ తో ఇంకా హై రేంజ్ లో చెప్పాలంటే బడ్జెట్ ఎక్కువ పెట్టాలని డిసైడ్ అయ్యారంట. అందుకే 500 కోట్ల బడ్జెట్ ‘స్పిరిట్’ మూవీ పైన పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. టీ సీరీస్ తో పాటు సందీప్ వంగా హోమ్ బ్యానర్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం కానుంది. మరో వైపు ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కోసం కరీనాకపూర్ ని సందీప్ రెడ్డి సంప్రదిస్తున్నాడంట. ఆమె డేట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.

అలాగే మూవీలో ప్రతినాయకుడి క్యారెక్టర్ కోసం కరీనాకపూర్ భర్త సైఫ్ అలీఖాన్ ని ట్రై చేస్తున్నాడంట. దేవర సినిమాతో సైఫ్ అలీఖాన్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మూవీ చేస్తే కచ్చితంగా పాన్ ఇండియా లెవల్ లో నెక్స్ట్ లెవల్ ఇమేజ్ రావడం గ్యారెంటీ. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.