1680 కోట్ల బడ్జెట్‌తో టీవీ కోసం మూవీ
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బుల్లితెర మూవీ ఏది? ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది.
By: Tupaki Desk | 4 Sep 2024 3:39 AM GMTప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బుల్లితెర మూవీ ఏది? ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. దీనికోసం ఏకంగా 1680 కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేసారు. ఇందులో స్టార్లు ఎవరో తెలుసా? పాపులర్ హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ -జార్జ్ క్లూనీ. ఇద్దరు దిగ్గజ నటులతో తెరకెక్కిన `ఊల్ఫ్స్` కోసం ఏకంగా 200 మిలియన్ డాలర్లు ఖర్చు చేయడం టీవీ రంగంలోనే అత్యంత ఖరీదైన ఫిల్మ్‌గా అవతరించింది. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ 1680 కోట్లు.
జోన్ వాట్స్ దీనికి దర్శకత్వం వహించారు. కొత్త యాక్షన్-కామెడీ ఊల్ఫ్స్ కోసం బ్రాడ్ పిట్ - జార్జ్ క్లూనీ 16 సంవత్సరాల తర్వాత తిరిగి కలిశారు. ఈ చిత్రం వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్‌ను కూడా ప్రదర్శించారు. ఇది ఇప్పటికే ప్రేక్షకులు విమర్శకుల నుండి చాలా ప్రశంసలు అందుకుంది.
అయితే ఊల్ఫ్స్ బడ్జెట్ గురించిన ఈ విషయం అందరినీ ఆశ్చర్యపడేలా చేస్తోంది. ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన TV చిత్రంగాను ఇది రికార్డులకెక్కింది. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం ఊల్ఫ్స్ కోసం ఇద్దరు పెద్ద స్టార్లకు ఒక్కొక్కరికి 35 మిలియన్ డాలర్లు చెల్లించారు. వారు ఈ సినిమాని నిజానికి థియేటర్లలో విడుదల చేయాలని పట్టుబట్టారు. కానీ నిర్మాతలు (యాపిల్) మనసు మార్చుకున్నారు. మొత్తం 200 మిలియన్ డాలర్ల వరకు బడ్జెట్ పెట్టిన ఈ చిత్రం ఇప్పుడు అమెరికాలోను విడుదలవుతోంది. ఇది నేరుగా OTT విడుదలకు వెళుతుందని సమాచారం. నెపోలియన్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ , ఆర్గిల్లె సహా ఇది బుల్లితెరపై అత్యంత ఖరీదైన చిత్రంగా నిలవనుంది.
సాలా గ్రాండేలో వెనిస్ ప్రీమియర్‌లో ఆదివారం రాత్రి ఊల్ఫ్స్ చిత్రం నాలుగు నిమిషాల స్టాండింగ్ వోవేషన్ ని అందుకుంది. దీంతో ఇందులో నటించిన నటీనటులు ఉప్పొంగిపోయారు. స్పైడర్ మాన్ ఫేం జోన్ వాట్స్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ యాపిల్ ఒరిజినల్ ఫిల్మ్స్ యాక్షన్-కామెడీల జాబితాలో ఉంది. సెప్టెంబర్ 20 నుండి పరిమిత సమయం వరకు థియేటర్లలో విడుదలవుతుంది. ఇది సెప్టెంబర్ 27న యాపిల్ TV+లో ప్రారంభమవుతుంది.