Begin typing your search above and press return to search.

NC 24కి నెక్స్ట్ లెవెల్ బజ్..!

తండేల్ తో సూపర్ హిట్ అందుకున్న నాగ చైతన్య ఈ సక్సెస్ కెరీర్ కి మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా 100 కోట్ల హీరో అనిపించుకోవడం కోసం నాగ చైతన్య చాలా కష్టపడ్డాడు.

By:  Tupaki Desk   |   2 March 2025 10:17 PM IST
NC 24కి నెక్స్ట్ లెవెల్ బజ్..!
X

తండేల్ తో సూపర్ హిట్ అందుకున్న నాగ చైతన్య ఈ సక్సెస్ కెరీర్ కి మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా 100 కోట్ల హీరో అనిపించుకోవడం కోసం నాగ చైతన్య చాలా కష్టపడ్డాడు. చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన తండేల్ సినిమాకు అన్నీ అలా కలిసి వచ్చాయి. తండేల్ సినిమా సక్సెస్ లో హీరోయిన్ సాయి పల్లవి, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కు కూడా ఎక్కువ మార్కులు ఇచ్చేయొచ్చు.

ఐతే తండేల్ లాంటి హిట్టు కొట్టాక నాగ చైతన్య తన నెక్స్ట్ సినిమా మీద మరింత ఫోకస్ తో పనిచేయాలని అనుకుంటున్నాడు. నాగ చైతన్య 24వ సినిమాగా రాబోతున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు డైరెక్షన్ లో లాక్ చేసుకున్నాడు. ఈ సినిమా కూడా థ్రిల్లర్ జోనర్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతుందని తెలుస్తుంది. విరూపాక్ష లాంటి థ్రిల్లర్ కథతో హిట్ అందుకున్న కార్తీక్ దండు ఈసారి దానికి మించి అనిపించేలా కథ రాసుకున్నాడట.

అంతేకాదు NC 24 సినిమా కోసం సాంకేతికంగా నూతన టెక్నాలజీ వాడుతున్నట్టు సినిమాటోగ్రాఫర్ ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సో నాగ చైతన్య నెక్స్ట్ సినిమాకు పర్ఫెక్ట్ ప్లానింగ్ జరుగుతుందని తెలుస్తుంది. ఐతే నాగ చైతన్య కూడా తండేల్ కి ఎంత కష్టపడ్డాడో దానికి మించి నెక్స్ట్ సినిమాకు పనిచేయాలని అనుకుంటున్నాడట.

కార్తీక్ దండు సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఐతే ఈ సినిమా తో మరోసారి సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు నాగ చైతన్య. సినిమాలో ప్రతి యాస్పెక్ట్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. మరి కార్తీక్, నాగ చైతన్య కలిసి ఏం చేస్తున్నారో కానీ NC 24 సినిమా మీద మాత్రం బజ్ రోజురోజుకీ పెరిగిపోతుంది.

ముఖ్యంగా నాగ చైతన్య మాత్రం నెక్స్ట్ సినిమా విషయంలో నో కాంప్రమైజ్ అనేలా ఉన్నాడట. నాగ చైతన్య, కార్తీక్ దండు సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. తండేల్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఫ్యాన్స్ లో కూడా అంచనాలు అధికంగా ఉంటాయి. వాటికి తగినట్టుగానే సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. నాగ చైతన్య 24 మాత్రమే కాదు 25వ సినిమా కోసం కూడా కథా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఆ సినిమా క్రేజీ కాంబినేషన్ సెట్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.