Begin typing your search above and press return to search.

నార్త్ అమెరికాలో దేవర రికార్డుల జాతర

నార్త్ అమెరికాలో తెలుగు సినిమాల స్టామినా ఎలా ఉంటుందో మరోసారి రుజువయ్యింది.

By:  Tupaki Desk   |   27 Sep 2024 6:58 AM GMT
నార్త్ అమెరికాలో దేవర రికార్డుల జాతర
X

నార్త్ అమెరికాలో తెలుగు సినిమాల స్టామినా ఎలా ఉంటుందో మరోసారి రుజువయ్యింది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే మన తెలుగు పాన్ ఇండియా సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ని నార్త్ అమెరికాలో అందుకుంటున్నాయి. బాక్సాఫీస్ ఏదైనా సరే తెలుగు సినిమాలకి తిరుగులేదని తాజాగా రిలీజ్ అయిన ‘దేవర’ మరోసారి ప్రూవ్ చేసింది.


ఈ చిత్రం ప్రీమియర్ షో ల ద్వారానే నార్త్ అమెరికాలో ఏకంగా 2.8 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ అందుకొని రికార్డ్ సృష్టించింది. తద్వారా నార్త్ అమెరికాలో మూడో అత్యధిక ప్రీమియర్స్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా ‘దేవర’ నిలిచింది. నిజానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఒక రోజు ముందుగానే 2.4 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని ‘దేవర’ చిత్రం అందుకుంది. ఇక ప్రీమియర్ షోలు పడటంతో పాటు వాటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందనే విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.

నార్త్ అమెరికాలో ప్రీమియర్ షో ల ద్వారా ‘దేవర’ 2.8 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిందని పోస్టర్ రిలీజ్ చేశారు. దీనికంటే ముందుగా 3.9 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ తో ‘కల్కి 2898ఏడీ’ మొదటి స్థానంలో ఉంది. 3.46 మిలియన్ డాలర్స్ ప్రీమియర్స్ కలెక్షన్స్ తో ‘ఆర్ఆర్ఆర్’ రెండో స్థానంలో నిలిచింది. ఇక 2.6 మిలియన్ డాలర్స్ తో మూడో స్థానంలో ఉన్న ‘సలార్’ వసూళ్లని ‘దేవర’ అధికమించింది.

నార్త్ అమెరికాలో ‘దేవర’ మూవీకి ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా రికార్డ్ స్థాయిలో వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 4 నుంచి 5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని ‘దేవర’ మొదటి రోజు అందుకుంటుందని భావిస్తున్నారు. అదే జరిగితే ‘దేవర’ ఖాతాలో మరో రికార్డ్ చేరుతుంది. అలాగే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కూడా 100+ కోట్లు దాటిపోతాయని అంటున్నారు.

సినిమాకి మిశ్రమ స్పందనలు వస్తున్న కూడా పబ్లిక్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. శని, ఆదివారాలు ‘దేవర’ మూవీకి ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అన్ని వర్గాలలో ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో థియేటర్స్ చాలా వరకు హౌస్ ఫుల్ అయినట్లు తెలుస్తోంది.