Begin typing your search above and press return to search.

కుర్రకారుని అరుపులు పెట్టించేస్తున్న ముద్దుగుమ్మలు..!

సూపర్ సినిమాలకు కొన్ని సాంగ్స్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయి.

By:  Tupaki Desk   |   17 Sep 2024 7:30 AM GMT
కుర్రకారుని అరుపులు పెట్టించేస్తున్న ముద్దుగుమ్మలు..!
X

సూపర్ సినిమాలకు కొన్ని సాంగ్స్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయి. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలకు మాస్ సాంగ్స్, స్పెషల్ ఐటం సాంగ్స్ అయితే ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తాయి. తెర మీద తమ అభిమాన హీరో మాస్ డాన్స్ చేస్తుంటే వీరాభిమానులంతా సీట్లలో కూర్చోరంటే నమ్మాల్సిందే. ఐతే ఆ మాస్ సాంగ్ కు తగినట్టుగా హీరోయిన్స్ కూడా మాస్ బీట్స్ తో అదరగొట్టేస్తున్నారు. ఒకప్పుడు ఈ డాన్స్ మూమెంట్స్ కోసం సెపరేట్ డాన్సర్స్ ఉండే వారు కానీ ఇప్పుడు కథానాయికలే అదరగొట్టేస్తున్నారు.

సీనియర్ స్టార్ హీరోయిన్స్ లో అందరు డాన్స్ బాగానే చేస్తుండే వారు కానీ వారిలో మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం సంథింగ్ స్పెషల్ గా అనిపించేది. హీరోలకి ఈక్వల్ గా డ్యాన్స్ మూమెంట్స్ తో తమన్నా సత్తా చాటేది. సమంత, పూజా హెగ్దే, అనుష్క ఇలా స్టార్ హీరోయిన్స్ అంతా కూడా అవకాశం వచ్చినప్పుడు తమ టాలెంట్ చూపించారు. ఐతే ఈ తరం భామలు అదే కొత్త హీరోయిన్స్ మాత్రం తెర మీద డ్యాన్స్ తో చితక్కొట్టేస్తున్నారు.

ఈమధ్య కాలంలో వచ్చిన హీరోయిన్స్ లో శ్రీ లీల డ్యాన్స్ ల గురించి అందరికీ తెలిసిందే. అమ్మడు చేసే డాన్స్ లకే సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో సందేహం లేదు. నేషనల్ క్రష్ రష్మిక కూడా డాన్సుల్లో అదుర్స్ అనిపిస్తుంది. ఇక రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ తో తెలుగు ఎంట్రీ ఇచ్చిన భాగ్య శ్రీ కూడా డాన్స్ లో తన సత్తా చాటేసేలానే కనిపిస్తుంది. మిస్టర్ బచ్చన్ లో అమ్మడి స్టెప్పులకు ఆడియన్స్ సూపర్ అనేశారు.


దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వి కపూర్ కూడా డ్యాన్స్ లో తన మార్క్ చాటుతుంది. ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్ లో జాన్వి అదుర్స్ అనిపించింది. తప్పకుండా తెలుగులో మిగతా హీరోయిన్స్ కు నటన, అందంలోనే కాదు డ్యాన్స్ లతో కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది జాన్వి. ఇలా కేవలం యాక్టింగ్ తోనే కాదు తమ డ్యాన్స్ తో కూడా అదరగొట్టేస్తున్నారు అందాల భామలు. ఈ టాలెంటెడ్ హీరోయిన్స్ తో డ్యాన్స్ ప్రాధాన్యత ఉన్న సినిమా తీసినా సరే కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుందని చెప్పొచ్చు.