Begin typing your search above and press return to search.

డిసెంబర్ లో ఇంకెంతమంది వస్తారో

ఈ ఏడాది డిసెంబర్ నెల టాలీవుడ్ ఇండస్ట్రీకి మోస్ట్ ప్రెస్టీజియస్ గా మారేలా కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   25 Sep 2024 5:59 AM GMT
డిసెంబర్ లో ఇంకెంతమంది వస్తారో
X

ఈ ఏడాది డిసెంబర్ నెల టాలీవుడ్ ఇండస్ట్రీకి మోస్ట్ ప్రెస్టీజియస్ గా మారేలా కనిపిస్తోంది. దీనికి కారణం టాలీవుడ్ లో ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమాలు రిలీజ్ కాబోతూ ఉండటమే. డిసెంబర్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలైన ‘పుష్ప2’, ‘గేమ్ చేంజర్’ డిసెంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. డిసెంబర్ 6న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ 20న ‘గేమ్ చేంజర్’ రిలీజ్ ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే. ఈ డేట్స్ మేగ్జిమమ్ మారే ఛాన్స్ అయితే లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లకి ఈ రెండు సినిమాలు కెరియర్ పరంగా చాలా కీలకమైన ప్రాజెక్ట్స్ అని చెప్పాలి. ‘పుష్ప 2’ పైన ఇప్పటికే 550 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ జరిగిందనే మాట వినిపిస్తోంది. ‘గేమ్ చేంజర్’ మూవీ బిజినెస్ కూడా క్లోజ్ చేసే పనిలో దిల్ రాజు ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ మధ్యలో మరో ప్రెస్టీజియస్ చిత్రంగా నాగ చైతన్య ‘తండేల్’ మూవీ డిసెంబర్ లో వచ్చే అవకాశం ఉంది.

డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. నిర్మాతగా బన్నీ వాస్ కెరియర్ లో ఇదే పెద్ద ప్రాజెక్ట్ గా ఉంది. అయితే ‘గేమ్ చేంజర్’ కి పోటీగా ‘తండేల్’ రిలీజ్ చేస్తారా అంటే అప్పుడే ఏమీ చెప్పలేమని సినీ విశ్లేషకులు అంటున్నారు. దీంతో పాటు నితిన్ ‘రాబిన్ హుడ్’ కూడా డిసెంబర్ 20కి రిలీజ్ కన్ఫర్మ్ అయ్యింది. ఒక వేళ ఈ మూవీ వాయిదా పడితే దిల్ రాజు బ్యానర్ లో నితిన్ చేస్తోన్న ‘తమ్ముడు’ మూవీ రిలీజ్ అవ్వొచ్చని టాక్ వినిపిస్తోంది.

దాంతో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ లో సూపర్ హిట్ మూవీ ‘మ్యాడ్’ కి సీక్వెల్ గా రెడీ అవుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారంట. ‘తమ్ముడు’, ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాల రిలీజ్ అవకాశాలని పరిశీలిస్తున్నారని టాక్. ఒక వేళ ‘గేమ్ చేంజర్’ వాయిదా పడితే దిల్ రాజు ‘తమ్ముడు’ చిత్రాన్ని రేసులోకి తీసుకురావొచ్చని అనుకుంటున్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తోన్న టాక్ ప్రకారం అయితే డిసెంబర్ రేస్ లో మూడు పాన్ ఇండియా సినిమాలు మరో రెండు మీడియం రేంజ్ మూవీస్ అయితే రిలీజ్ కి కనిపిస్తున్నాయి. వీటిలో ఫైనల్ గా ఎన్ని బాక్సాఫీస్ దగ్గర పోటీ పడతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పుష్ప 2 రిలీజ్ డేట్ లో అయితే మార్పు ఉండదు. డిసెంబర్ 20న క్రిస్మస్ కి పోటీ పడబోతున్న సినిమాల రిలీజ్ డేట్స్ లలో మాత్రం మార్పులు ఉండొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.