2025 సమ్మర్ బాక్సాఫీస్.. ఎలా ఉండబోతోందంటే..
2025 సంక్రాంతి రేసులో సినిమాలు ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయాయి.
By: Tupaki Desk | 13 Oct 2024 5:15 AM GMT2025 సంక్రాంతి రేసులో సినిమాలు ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయాయి. టాలీవుడ్ నుంచి మూడు సినిమాలు రిలీజ్ కావడం ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది. వాటిలో రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ ఒకటి ఉంది. ఇక పొంగల్ హాలిడేస్ తర్వాత సమ్మర్ బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ ఉండబోతోంది. బ్యాక్ టూ బ్యాక్ ఆరు పాన్ ఇండియా మూవీస్ తెలుగులో రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలు అన్ని కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నవే కావడం విశేషం.
మార్చి 28 న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కాబోతోంది. మొన్నటి వరకు ఈ సినిమాపై పెద్దగా హైప్ లేదు. అయితే నిర్మాత ఏఎం రత్నం అండ్ కో ‘హరిహర వీరమల్లు’ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ మూవీ పైన అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఫస్ట్ టైం కంప్లీట్ పీరియాడికల్ జోనర్ లో విప్లవయోధుడి పాత్రలో కనిపించనున్నాడు. అందుకే ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ హై ఎండ్ లో ఉన్నాయి.
ఇక ఏప్రిల్ 10న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజాసాబ్’ రిలీజ్ కాబోతోంది. దేశ వ్యాప్తంగా ఈ సినిమా సంచలనాలు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని డార్లింగ్ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 18న తేజా సజ్జా పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’ థియేటర్స్ లోకి రాబోతోంది. సూపర్ హీరో కాన్సెప్ట్ తోనే ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో మంచు మనోజ్ పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన టీజర్ తో ‘మిరాయ్’ పై అంచనాలు పెరిగాయి.
మే 1న నేచురల్ స్టార్ నాని నుంచి ‘హిట్ 3’ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజ్ నుంచి వస్తూన్న చిత్రం కావడంతో ఈ సినిమాపైన అంచనాలు భారీగానే ఉన్నాయి. ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ని అందుకుంటాననే నమ్మకంతో నాని ఉన్నారు. మే 9న మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా మూవీ ‘విశ్వంభర’ థియేటర్స్ లోకి రాబోతోంది. తాజాగా వచ్చిన టీజర్ తో ఈ సినిమాపై హైప్ పెరిగింది.
సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. నెక్స్ట్ మే నెలలో విజయ్ దేవరకొండ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘VD12’ థియేటర్స్ లోకి రాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. మూవీలో విజయ్ దేవరకొండ రెండు భిన్నమైన లుక్స్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంతో కచ్చితంగా సక్సెస్ అందుకోవాలని కసితో విజయ్ ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. 2025 సమ్మర్ కి మొత్తం ఆరు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ థియేటర్స్ లో ప్రేక్షకులని పలకరించబోతున్నాయి. వీటిలో ఎన్ని సక్సెస్ అందుకుంటాయనేది చూడాలి.