పాన్ ఇండియా హీరోలపై కెప్టెన్లకు అది కామనే!
అయితే ఈ రకమైన ఇమేజ్ దర్శకులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తుంది అన్నది వాస్తవం.
By: Tupaki Desk | 22 Feb 2025 8:30 AM GMTప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీల పాన్ ఇండియా ఇమేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. వందల, వేల కోట్లు వసూళ్లు తేగల సత్తా ఉన్న నటులు. అంతర్జాతీయ స్థాయిలోనూ మార్కెట్ ఉన్న నటులు. చైనా, జపాన్, అమెరికా, రష్యా, మలేషియా లాంటి దేశాల్లోనూ ఈ స్టార్ హీరోల సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తుంటాయి. అయితే ఈ రకమైన ఇమేజ్ దర్శకులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తుంది అన్నది వాస్తవం.
అలాంటి హీరోలతో తదుపరి సినిమా చేయాలంటే? ఎన్నో విషయాలు..ఎంతో ఒత్తిడి తీసుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఆన్ సెట్స్ లో ఉన్న కొంత మంది మేకర్స్ ఈ రకమైన ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు తన రెండవ సినిమానే ఏకంగా రామ్ చరణ్ తో చేస్తున్నాడు. ఓ చిన్న హీరోని డైరెక్ట్ చేసిన వెంటనే చరణ్ బుచ్చిబాబు ని నమ్మి అవకాశం ఇచ్చేసాడు. చరణ్ గత పాన్ ఇండియా చిత్రం `గేమ్ ఛేంజర్` కూడా డిజాస్టర్ అయింది.
ఈ నేపథ్యంలో బుచ్చిబాబు ఆ వైఫల్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సి ఉంటుంది. ఇక ప్రభాస్ మారుతి దర్శకత్వంలో `రాజాసాబ్` చేస్తున్నాడు. మారుతికి ఈ సినిమా పెద్ద టాస్క్. పాన్ ఇండియా లో రిలీజ్ అవుతుందా? రీజనల్ గానే రిలీజ్ చేస్తారా? అన్నది తర్వాత సంగతి కానీ తాను పెద్ద పాన్ ఇండియా సంచలనాన్ని డైరెక్ట్ చేస్తున్నాననే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తున్నాడు. ఆ రకంగా కొంత ఒత్తిడి మారుతిపై ఉంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి `వార్ 2`లో నటిస్తున్నాడు.
దీన్ని ఆయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. తారక్ ని డైరెక్ట్ చేయడం ఇదే తొలిసారి. అతడి పాన్ ఇండిమా ఇమేజ్ సహా...టాలీవుడ్ ఇమేజ్ ని దృష్టి లో పెట్టుకుని సినిమా చేయాల్సి వస్తోంది. తేడా ఎక్కడ జరిగినా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సిందే. ఇక బన్నీతో తదుపరి సినిమా త్రివిక్రమ్ చేస్తున్నాడు. గురూజీకి ఇదే తొలిపాన్ ఇండియా సినిమా. బన్నీ పాన్ ఇండియాలో ఓసంచలనమైన నేపథ్యంలో గురూజీ ఎంతో కేర్ పుల్ గా చేయాల్సిన ప్రాజెక్ట్ గానూ కనిపిస్తోంది. అయితే దర్శకులపై ఈ రకమైన ఒత్తిడి సహజం గానే నెలకొంటుంది.