Begin typing your search above and press return to search.

యూఎస్ఏలో దేవర ప్రీమియర్స్… రికార్డ్ బుకింగ్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా కోసం యూఎస్ఏలో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By:  Tupaki Desk   |   17 Sep 2024 5:02 AM GMT
యూఎస్ఏలో దేవర ప్రీమియర్స్… రికార్డ్ బుకింగ్స్
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా కోసం యూఎస్ఏలో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ కి ఇంకా 10 రోజులు సమయం ఉంది. మూడు వారాల ముందుగానే యూఎస్ లో ‘దేవర’ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. ట్రైలర్ రిలీజ్ కాకుండానే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 1 మిలియన్ గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకొని రికార్డ్ సృష్టించింది. అలాగే సెప్టెంబర్ 26న వేసే స్పెషల్ ప్రీమియర్స్ కోసం 30000 టికెట్స్ ట్రైలర్ రిలీజ్ కి ముందే బుక్ అయ్యాయి.


ఇదిలా ఉంటే మూవీ రిలీజ్ కి ఇంకా 10 రోజుల సమయం ఉంది. యూఎస్ లో ప్రీమియర్ షోలకి ఇప్పటి వరకు ఏకంగా 45000 టికెట్స్ బుక్ అయ్యాయని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. అలాగే ఓవరాల్ గా ఓవర్సీస్ లో 1.75 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా రిలీజ్ కి సమయం ఉండటంతో ప్రీమియర్ షోలకి 50000 వరకు టికెట్స్ బుక్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

‘దేవర’ ఫస్ట్ ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. దీంతో మూవీ ప్రీరిలీజ్ నాటికి ‘దేవర’ సెకండ్ ట్రైలర్ ని కూడా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారంట. ఈ సెకండ్ ట్రైలర్ కి మంచి ఆదరణ వస్తే కచ్చితంగా సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ మరింత ఎక్కువ జరుగుతాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా యూఎస్ లో ప్రీమియర్ షోలకి ప్రత్యేకంగా అటెండ్ అవ్వబోతున్నారు. అక్కడ థియేటర్స్ లో పబ్లిక్ తో తారక్ నేరుగా ఇంటరాక్ట్ అయ్యి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారనే మాట వినిపిస్తోంది.

ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. త్వరలో ఇండియాలో కూడా ‘దేవర’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ‘దేవర’ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘దేవర’ చిత్రానికి మొదటి రోజు 100 నుంచి 150 కోట్ల మధ్యలో గ్రాస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా వస్తాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడని అధికారికంగా అందరికి తెలుసు. అయితే మూడో పాత్ర కూడా ఉంటుందనే ప్రచారం కొద్ది రోజులుగా నడుస్తోంది. ఆ క్యారెక్టర్ రివిలేషన్ సినిమాలో సర్ప్రైజ్ ఎలిమెంట్ గా ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.