Begin typing your search above and press return to search.

పెద్ద టార్గెట్ తోనే కాంతార 1..?

కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన కాంతారా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

By:  Tupaki Desk   |   13 July 2024 2:30 PM GMT
పెద్ద టార్గెట్ తోనే కాంతార 1..?
X

కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన కాంతారా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రిషబ్ శెట్టి నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను హోంబలే ప్రొడక్షన్స్ కేవలం 20 కోట్ల లోపే నిర్మించింది. కానీ సినిమా భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకుంది. సినిమా దాదాపు 400 కోట్ల దాకా కలెక్ట్ చేసినట్టు తెలిసిందే. కాంతారా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో కాంతారా 1 గా ముందు కథను చెప్పబోతున్నారు రిషబ్ శెట్టి.

ఐతే కాంతారా ఆ రేంజ్ లో హిట్ అవ్వడం వల్ల కాంతార 1 మీద భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని అందుకునేందుకు రిషబ్ శెట్టి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. కాంతారా లో కన్నా రాబోతున్న ఈ పార్ట్ లో మరిన్ని గూస్ బంప్స్ ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా భారీగా ఉంటుందని తెలుస్తుంది.

కాంతార తో 400 కోట్లు టచ్ చేసిన రిషబ్ శెట్టి ఈ సీక్వెల్ సినిమాతో 1000 కోట్ల మార్క్ టచ్ చేయాలని చూస్తున్నాడు. అదే టార్గెట్ తో చిత్ర యూనిట్ మొత్తం పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాంతార ప్రీక్వెల్ గా వస్తున్న కాంతారా 1 కథ చాలా పెద్దగా ఉందని ఈ సినిమా అలా కొనసాగుతూనే ఉంటుందని తెలుస్తుంది. సో కాంతారా 1 తోనే కాదు ఇంకా చాలా భాగాలుగా ఈ కథ కొనసాగుతుందని చెప్పుకుంటున్నారు.

కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ అందరికీ గూస్ బంప్స్ తెప్పించగా ప్రీక్వెల్ లో నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. కాంతార 1 తో మరోసారి నేషనల్ లెవెల్ లో హంగామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాంతార 1 కి బడ్జెట్ కూడా భారీగా పెట్టేస్తున్నారని తెలుస్తుంది. మరి కాంగార ప్రీక్వెల్ గా వస్తున్న కాంతార 1 నిజంగానే బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుందా లేదా అన్నది చూడాలి. కాంతారా ప్రీక్వెల్ గా వస్తున్న కాంతార 1 మీద కేవలం కన్నడలోనే కాదు సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ మేకర్స్ ని కూడా భారీ హైప్ ఏర్పడింది. అది అందుకునేలా కథ కథనాలు ఉన్నాయంటే మాత్రం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదని చెప్పొచ్చు.