Begin typing your search above and press return to search.

రూ.8355 కోట్ల బడ్జెట్‌... రూ. లక్షల్లో కలెక్షన్స్‌

హాలీవుడ్‌ మూవీ బ్యాడ్‌ బాయ్స్‌ ప్రపంచ వ్యాప్తంగా సంచలన వసూళ్లు సాధిస్తూ దూసుకు పోతుంది.

By:  Tupaki Desk   |   12 Jun 2024 11:30 AM GMT
రూ.8355 కోట్ల బడ్జెట్‌... రూ. లక్షల్లో కలెక్షన్స్‌
X

హాలీవుడ్‌ మూవీ బ్యాడ్‌ బాయ్స్‌ ప్రపంచ వ్యాప్తంగా సంచలన వసూళ్లు సాధిస్తూ దూసుకు పోతుంది. ఇండియన్‌ కరెన్సీ లెక్కల్లో రూ.8355 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా పది వేల కోట్లు వస్తాయని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. అనుకున్నట్లుగానే లాంగ్ రన్‌ లో ఆ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.

అమెరికాతో పాటు ఇతర దేశాల్లో బ్యాడ్‌ బాయ్స్ సినిమాకు ఓ రేంజ్ వసూళ్లు నమోదు అవుతూ ఉంటే ఇండియాలో మాత్రం ఘోరమైన పరాభవం అన్నట్లుగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. లాంగ్‌ రన్‌ లో కనీసం అయిదు కోట్ల రూపాయల వసూళ్లను కూడా ఈ సినిమా దక్కించుకుంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇండియన్ బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మొదటి రోజు ఈ సినిమా రూ.35 లక్షలు, రెండో రోజు 45 లక్షలు, మూడో రోజు 90 లక్షలు, ఆ తర్వాత వరుసగా 65 లక్షలు, 20 లక్షలు, 35 లక్షల చొప్పున వసూళ్లు నమోదు చేయడం జరిగింది.

వీకెండ్స్ లో కాస్త పర్వాలేదు అనిపించుకున్న ఈ సినిమా వీక్ డేస్ లో లో బడ్జెట్‌ సినిమాల స్థాయిలో కూడా వసూళ్లు నమోదు చేయలేక పోయింది. ఇప్పటికే ఈ సినిమా ను సగం థియేటర్‌ నుంచి తొలగించి ఉంటారు అనే ప్రచారం మొదలయ్యింది.

గతంలో వచ్చిన పలు హాలీవుడ్‌ సినిమాలకు ఇండియన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కానీ ఈసారి ఎందుకు ఇంత దారుణంగా బ్యాడ్‌ బాయ్స్ ని అవమానిస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.