Begin typing your search above and press return to search.

హిందీలో టాప్ కలెక్షన్స్ అందుకున్న సౌత్ హీరోల సినిమాలివే

పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయ్యాక సౌత్ హీరోలు బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు.

By:  Tupaki Desk   |   23 July 2024 4:02 AM GMT
హిందీలో టాప్ కలెక్షన్స్ అందుకున్న సౌత్ హీరోల సినిమాలివే
X

పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయ్యాక సౌత్ హీరోలు బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. నార్త్ ఇండియన్ మార్కెట్ లో మన సౌత్ హీరోలతో తెరకెక్కి హిందీ వెర్షన్ లో రిలీజ్ అయిన సినిమాలు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ అందుకుంటున్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండియన్ స్టార్స్ నుంచి వస్తోన్న సినిమాల కంటెంట్ నచ్చడంతోనే నార్త్ ఇండియన్స్ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. లాంగ్ రన్ లో అద్భుతమైన వసూళ్లని మన సినిమాలు నార్త్ ఇండియన్ మార్కెట్ సొంతం చేసుకుంటున్నాయి.

హిందీ వెర్షన్ లో రిలీజ్ అయ్యి అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న సౌత్ హీరోల సినిమాలు ఏంటనేది చూసుకుంటే మొదటి స్థానంలో బాహుబలి పార్ట్ 1 కనిపిస్తోంది. డార్లింగ్ ప్రభాస్ నటించిన ఈ సినిమా హిందీలో ఈ ఏకంగా 511 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుని టాప్ లో నిలిచింది. దీని తర్వాత రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ 435.2 కోట్ల కలెక్షన్స్ తో రెండో స్థానంలో ఉంది. ఈ ఏడాది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కి గ్రాండ్ గా రిలీజ్ అయిన కల్కి 2898ఏడీ మూవీ ఇప్పటివరకు 257.40 కోట్ల కలెక్షన్స్ అందుకొని మూడవ స్థానంలోకి వచ్చింది.

నెక్స్ట్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ గా రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమా 276.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో నాలుగువ స్థానంలో ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి రోబో సీక్వెల్ గా వచ్చిన 2.ఓ మూవీ 189 కోట్ల కలెక్షన్స్ తో టాప్ 5 మూవీగా నిలిచింది. తర్వాత 153.45 కోట్ల కలెక్షన్స్ తో సలార్ పార్ట్ 1 టాప్ 6లో ఉండగా, సాహో మూవీ 150.6 కోట్లతో టాప్ 7 హైయెస్ట్ కలెక్షన్స్ సినిమాలుగా ఉన్నాయి.

ప్రభాస్ ఆదిపురుష్ మూవీ డిజాస్టర్ అయిన కూడా 143.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని హిందీలో అందుకుంది. తద్వారా టాప్ 8లో నిలిచింది. బాహుబలి పార్ట్ 1 మూవీ 115 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి 108.61 కోట్ల గ్రాస్ వసూళ్లని హిందీ మార్కెట్ లో కలెక్ట్ చేసింది. ఈ రెండు సినిమాలు టాప్ 9, 10 స్థానాలలో ఉండడం విశేషం.

బాహుబలి పార్ట్ 2- 511Cr~

కేజీఎఫ్ 2– 435.2Cr

కల్కి 2898AD - 277.40CR******

ఆర్ఆర్ఆర్– 276.8Cr

2.ఓ - 189Cr

సలార్ పార్ట్ 1 - 153.45CR

సాహో - 150.6Cr

ఆదిపురుష్ - 143.25CR

బాహుబలి పార్ట్ 1 - 115Cr

పుష్ప పార్ట్ 1 –108.61Cr

కాంతారా - 79.60Cr

కేజీఎఫ్ చాప్టర్ 1 - 45Cr