Begin typing your search above and press return to search.

2025 బాక్సాఫీస్.. ఆరంభంలోనే అసలు బీభత్సం!

సంక్రాంతి సీజన్ అంటే తెలుగు సినిమాలకి పెద్ద పండగ. ఆ టైంలో సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు పోటీ పడుతూ ఉంటారు.

By:  Tupaki Desk   |   15 March 2024 7:30 AM GMT
2025 బాక్సాఫీస్.. ఆరంభంలోనే అసలు బీభత్సం!
X

సంక్రాంతి సీజన్ అంటే తెలుగు సినిమాలకి పెద్ద పండగ. ఆ టైంలో సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు పోటీ పడుతూ ఉంటారు. ముఖ్యంగా పెద్ద సినిమాలని సంక్రాంతి రేసులో ఎక్కువగా రిలీజ్ చేయడం ఆనవాయితీగా మారిపోయింది. మీడియం రేంజ్ సినిమాలు కూడా గట్టి పోటీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.

సినిమా నిర్మాత ఎంత స్ట్రాంగ్ గా ఉంటే సంక్రాంతి పోటీలో అంత బలంగా నిలబడగలడు అనేది ఈ మధ్య వినిపిస్తోన్న మాట. ఈ ఏడాది సంక్రాంతి సీజన్ కి నాలుగు సినిమాలు రిలీజ్ అయితే అందులో హనుమాన్ మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఒక విధంగా హనుమాన్ అయితే ఇప్పటివరకు వచ్చిన సంక్రాంతి సినిమాల్లో ఏ సినిమా అందించనంత లాభాలు అందించింది. కింగ్ నాగార్జున నా స్వామిరంగా ఓ మోస్తరుగా సక్సెస్ అందుకుంది. చాలా రోజుల తరువాత నాగ్ కు ఓ మంచి సక్సెస్ దక్కింది.

ఇక మిగిలిన సినిమాలు ప్రేక్షకులని మెప్పించలేకపోయాయి. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి కోసం ఇప్పటి నుంచి పెద్ద సినిమాలు పోటీలోకి రావడానికి సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అయితే సంక్రాంతి రిలీజ్ అని ఖాయం నిర్మాతలు ఖాయం చేసేసారు. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ లేట్ అయితేనే తప్ప సినిమా మిస్సయ్యే ఛాన్స్ లేదు. పక్కా ప్రణాళికతో దర్శకుడు వశిష్ఠ సినిమాను ఫినిష్ చేస్తున్నాడు.

మరోవైపు వెంకీ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కనున్న కమర్షియల్ ఎంటర్టైనర్ కూడా సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది అనుకున్న టైమ్ కు ఫినిష్ కాకపోతే నిర్మాత దిల్ రాజు శతమానం భవతి 2ని రంగంలోకి దింపే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోను ఆయన సంక్రాంతి సీజన్ ను అయితే మిస్ కాకుండా చూసుకుంటున్నారు.

ఇక ఇప్పుడు లేటెస్ట్ గా అజిత్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారంట. ఈ సినిమాను మైత్రి వాళ్ళు నిర్మిస్తున్నారు కాబట్టి తెలుగు రిలీజ్ మరింత ఆసక్తికరంగా మారబోతోంది. అజిత్ సినిమాలు క్లిక్కయితే తెలుగులో కొన్నిసార్లు మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. ఇక ఈసారి తెలుగు నిర్మాతల సినిమా కాబట్టి ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేసే అవకాశం ఉంది.

మరోవైపు కింగ్ నాగార్జున బంగార్రాజు సీక్వెల్ తో సంక్రాంతికి రావాలని అనుకుంటున్నారు. వచ్చే సంక్రాంతికి కలుద్దాం అంటూ పరోక్షంగా హింట్ కూడా ఇచ్చాడు. దీనిని బట్టి నాగార్జున రావడం ఖాయం అనే టాక్ నడుస్తోంది. డార్లింగ్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాజాసాబ్ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నామని నిర్మాత విశ్వప్రసాద్ ఓ సందర్భంలో చెప్పారు. ఈ లెక్కన చూసుకుంటే ఇప్పటికి అయితే ఆరు సినిమాలు సంక్రాంతి రేసులో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటానికి రెడీగా ఉన్నట్లే.