Begin typing your search above and press return to search.

ఆ హాలీవుడ్ స్టార్ కి హిట్ మ్యాన్ అంటే!

హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ కి ఇండియా వైడ్ ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కోట్లాది మంది అభిమానించే ప్లేయ‌ర్ రోహిత్

By:  Tupaki Desk   |   6 July 2024 4:55 AM GMT
ఆ హాలీవుడ్ స్టార్ కి హిట్ మ్యాన్ అంటే!
X

హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ కి ఇండియా వైడ్ ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కోట్లాది మంది అభిమానించే ప్లేయ‌ర్ రోహిత్. అత‌డి బాదుడంటే పిచ్చెక్కిపోయే అభిమానులు ఎంతో మంది. హిట్ మ్యాన్ క్రీజ్ లో ఉన్నంత సేపు ప్ర‌త్య‌ర్ధుల‌కు సినిమా ఎలా ఉంటుంద‌న్న‌ది? అంద‌రికీ తెలుసు. సిక్సుల‌తో సునామీ సృష్టించ‌డం అన్న‌ది అత‌డికి మాత్ర‌మే తెలిసిన టెక్నిక్.

బంతిని చూసి భ‌య‌ప‌డే ర‌కం కాదు. బంతి మీద‌కు దూసుకుపోయే ర‌కం. అత‌డ బ్యాట్ దెబ్బ‌కి బంతి బాబోయ్ అంటూ గ్యాల‌రీలో ప‌డుతుంది. అత‌డు క్రీజ్ లో ఉన్నంత సేపు ప్ర‌త్య‌ర్ధులు ఆశ‌లు వ‌దులు కోవాల్సిందే. అందుకే అత‌డ‌ని వీలైనంత త్వ‌ర‌గా పెవిలియ‌న్ కి పంపిచాల‌ని ప్ర‌త్య‌ర్ధి చూస్తారు. ఇలా అత‌డి ప్ర‌తిభ‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న స్టార్ క్రికెట‌ర్ రోహిత్.

అత‌డి బ్యాటింగ్ శైలిని ఇష్ట‌ప‌డే సీనియ‌ర్ ప్లేయ‌ర్లు ఎంతో మంది. తాజాగా రోహిత్ నా అభిమాన ప్లేయ‌ర్ అంటూ హాలీవుడ్ న‌టుడు సైతం ముందుకొచ్చారు. మార్కెల్ సిరీస్ ఎక్స్ మ్యాన్ హీరో హ్యూ జాక్ మ‌న్ ఈవిష‌యాన్ని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో గ్లింప్ ని మార్వెల్ ఇండియా ట్వీట్ చేసింది. జాక్ క్రికెట్ కి వీరాభిమానిగా అందులో హైలైట్ అవుతుంది. క్రికెట్ లో రోహిత్ బీస్ట్ అన్నారు.

దీంతో మార్వెల్ స్టార్ రోహిత్ ని ఎంత‌గా అభిమానిస్తున్నాడో అద్దం ప‌డుతుంది. అత‌డే కాదు రోహిత్ శైలిపై ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా అభిప్రాయ‌ప‌డ్డారు. షారుక్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి ఎంతో మంది స్టార్లు రోహిత్ ఆట‌ను ఎంతగానో లైక్ చేస్తారు. ముఖ్యంగా షారుక్ ఖాన్ అయితే ఇండియా ఆడే ఏ మ్యాచ్ లు మిస్ అవ్వ‌రు అన్న సంగ‌తి తెలిసిందే. అత‌డికి క్రికెట్ అంటే అంత ఇష్ట‌ప‌డ‌తారు.