నడుము సైజు మారాలని హింసించారన్న నటి
తాజాగా బాడీ పాజిటివిటీ గురించి హుమా ఖురేషి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచాయి.
By: Tupaki Desk | 28 July 2023 3:01 PM GMTహూమా ఖురేషి .. పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో క్రేజీ నాయికగా కొనసాగుతున్న ఈ బ్యూటీ ఇంతకుముందు టాలీవుడ్ ఎగ్రెసివ్ హీరో గోపిచంద్ సినిమా లో ఆసక్తికర పాత్రతో తెలుగు వారికి సుపరిచితమైంది. ఆలియా నటించిన 'గంగూభాయి కథియావాడీ'లో ఓ పాట లో అద్భుతమైన అభినయంతో కట్టి పడేసిన హ్యూమాని అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు.
హ్యూమా ఓపెన్ మైండ్ సెట్.. ముక్కుసూటిదనం అభిమానుల హృదయాల్ని హత్తుకుంటాయి. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి హుమా ఖురేషి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచాయి. అధికబరువు బొద్దుతనాన్ని కలిగి యుండడం పై హూమా గళం విప్పింది. బాడీ పాజిటివిటీని స్వీకరించడం అవాస్తవిక అందం ప్రమాణాల ను తిరస్కరించడం గురించి మాట్లాడింది. అలాగే ఒక నిర్దిష్టమైన సన్నజాజి నడుమును మాత్రమే కలిగి ఉండాలనే సమాజం డిమాండ్ ను అంతగా పట్టించుకోకూడదని హ్యూమా అభిప్రాయపడింది.
"పేకర్-స్ట్రెయిట్ హెయిర్ లేదా 24 ఇంచి నడుము కంటే చాలా ముఖ్యమైనది వ్యక్తిత్వం.. ఎవరైనా వ్యక్తిత్వాన్ని పెంపొందించడం పై దృష్టి పెట్టాలి. సన్నగా ఉన్నందుకు సిగ్గుపడే స్నేహితులు నాకు చాలా మంది ఉన్నారు. స్త్రీల శరారాకృతి ఎలా ఉన్నా ఎందుకని అంగీకరించలేరు? అంటూ ప్రశ్నించింది. ఎవరి ఇష్టం వారిది.. ఎవరి శరీరం ఎలా ఉండా లో అది వారి ఇష్టం అని హుమా గట్టిగా వాదించారు. స్త్రీల రూపం బరువుపై సామాజిక తీర్పులను సవాల్ చేయాల్సిన అవసరం ఉందని హూమా బలంగా చెబుతోంది.
"నా ఉద్దేశ్యం ప్రకారం.. ప్రస్తుతం అమెరికా లో మహిళల కు వారి శరీరాల పై హక్కు లేని కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. వారు చట్టబద్ధమైన గర్భస్రావం ప్రయత్నించరు. ఇది ఎంత విచారకరం? మన శరీరాల తో మనం ఏం చేయాలో ఎవరో నిర్ణయిస్తారు? ఇది అందరి సమస్యగా ఎందుకు ఉండాలి? ఇది స్త్రీ వ్యక్తిగత ఎంపిక కాదా?'' అని హూమా ప్రశ్నించింది. నేను ఎప్పుడూ స్టార్ ల వెంట పడలేదు. నేను నిజంగా ఫలానా అమ్మాయిలా ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు. ఒకవేళ అలా మారినా అది నేను కాదు అని హూమా వ్యాఖ్యానించారు. ''నేను ఎప్పుడూ రెడ్ కార్పెట్ పై నిరూపించే అమ్మాయిగా.. ప్రతి సంవత్సరం కేన్స్‌కి వెళ్లగల అర్హురాలిగా.. అన్నివిధాలా ఫ్యాషన్ రంగం లో రాణించే కళాకారిణిగా నన్ను నేను చూడాలనుకుంటున్నాను. నేను నా ఫ్యాషన్ ని ప్రేమిస్తున్నాను. నేను ఈ ప్రపంచాలన్నింటిని చుట్టేసే నటి గా ఉండాలనుకుంటున్నాను'' అని హుమా నొక్కిచెప్పారు.
ఇటీవల హ్యూమా భారతీయ చెఫ్, కుక్‌బుక్ రచయిత తర్లా దలాల్ జీవితంపై తెరకెక్కించిన బయోపిక్ 'తర్లా'లో కనిపించింది. ఈ చిత్రానికి పియూష్ గుప్తా దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాలా, అశ్వినీ అయ్యర్ తివారీ , నితేష్ తివారీల సమర్పణలో ZEE5లో విడుదలైన ఈ బయోపిక్ విమర్శకుల నుండి మంచి స్పందనలు అందుకుంది. తదుపరి హ్యూమా పూజా మేరీ జాన్ లో కనిపించనుంది. చేసే పనిలో అంకితభావం .. బాడీ పాజిటివిటీ ని ప్రోత్సహించడం లో తన కు ఉన్న నిబద్ధత హూమాను పరిశ్రమలో రోల్ మోడల్ గా మారుస్తూనే ఉంది.