Begin typing your search above and press return to search.

స‌మంత‌పై విరుచుకుప‌డ్డ డాక్ట‌ర్లు

అదే క్ర‌మంలో స‌మంత వైర‌ల్ సీజ‌న్ గురించి వ్యాఖ్యానిస్తూ.. డాక్ట‌ర్ల‌ను డైల‌మాలోకి నెట్టే స్టేట్ మెంట్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   5 July 2024 4:18 AM GMT
స‌మంత‌పై విరుచుకుప‌డ్డ డాక్ట‌ర్లు
X

పాన్ ఇండియాలో అత్యంత ప్రభావ‌వంత‌మైన స్టార్ గా వెలిగిపోతోంది స‌మంత‌. దేశ‌వ్యాప్తంగా స‌మంత‌ను సోష‌ల్ మీడియాల్లో కోట్లాది మంది అనుస‌రిస్తున్నారు. స‌మంత నిరంత‌రం ఫిట్ నెస్ గోల్స్, ఆరోగ్య సూత్రాల గురించి అభిమానుల‌కు ప‌లు సూచ‌న‌లు స‌ల‌హాలు ఇస్తున్నారు. అదే క్ర‌మంలో స‌మంత వైర‌ల్ సీజ‌న్ గురించి వ్యాఖ్యానిస్తూ.. డాక్ట‌ర్ల‌ను డైల‌మాలోకి నెట్టే స్టేట్ మెంట్ ఇచ్చారు.

అన‌వ‌స‌ర‌మైన మందులు వాడ‌కుండా నెబ్యులైజ‌ర్ ద్వారా వైర‌ల్ రుగ్మ‌త‌ల‌ను దూరం చేయొచ్చ‌ని స‌మంత త‌న అనుభ‌వ పాఠాల నుంచి ఒక స‌ల‌హా ఇచ్చారు. అందుకు సంబందించిన ఫోటోల‌ను కూడా షేర్ చేయ‌డంతో అది డాక్ట‌ర్ల క‌డుపు మంట‌కు కార‌ణ‌మైంది. స‌మంత స‌ల‌హా హానిక‌రం పాటించొద్దు! అంటూ ప‌లువురు డాక్ట‌ర్లు కౌంట‌ర్లు ఇచ్చారు. సోష‌ల్ మీడియాల్లో ప్ర‌స్తుతం ఇది డిబేట్ గా మారింది.

ఈ వ‌ర్షా కాలంలో జ్వ‌రాలు జ‌లుబు ద‌గ్గు వంటి వైర‌ల్ అనారోగ్య స‌మ‌స్య‌లు స‌హ‌జం. వాటి కోసం అన‌వ‌స‌రంగా మాత్ర‌లు మింగ‌కండి. సాధారణ వైరల్ రుగ్మ‌త‌ల‌ కోసం మందులు తీసుకునే ముందు ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రయత్నించండి. హైడ్రోజన్ పెరాక్సైడ్ - స్వేదజలం మిశ్రమంతో నెబ్యులైజ్ చేయడం ఒక ఎంపిక. మేజిక్ లాగా పనిచేస్తుంది. అనవసరంగా మాత్రలు వాడటం మానుకోండి'' అని సమంత కథనంలో రాసారు. దీనిపై స్పందిస్తూ, హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ముంబైలోని వోకార్డ్ హాస్పిటల్స్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ రితుజా ఉగల్‌ముగ్లే విరుచుకుప‌డ్డారు. ''హైడ్రోజన్ పెరాక్సైడ్ (H₂O₂) - డిస్టిల్డ్ వాటర్ నెబ్యులైజేషన్ గురించి ప‌లు సందర్భాలలో చర్చించాం. వీటిలో వంటింటి వైద్య చిట్కాలు, నివారణలు ప్రత్యామ్నాయ చికిత్సలు ఉన్నాయి. అయినప్పటికీ ప్ర‌జ‌లు సుర‌క్షితంగా ఉండాలంటే డాక్ట‌ర్ల స‌ల‌హాలు తీసుకోవడం చాలా అవసరం'' అని అన్నారు.

డాక్ట‌ర్ రితురాజు మాట్లాడుతూ.. హైడ్రోజన్ పెరాక్సైడ్ - డిస్టిల్డ్ వాటర్ ప్రమాదాలను మరింతగా ఎత్తి చూపారు. ''హైడ్రోజన్ పెరాక్సైడ్ - డిస్టిల్డ్ వాటర్ నెబ్యులైజేషన్ రెండూ కొన్నిసార్లు ప్ర‌మాద‌క‌రం. హైడ్రోజన్ పెరాక్సైడ్ సాధారణంగా నెబ్యులైజేషన్ కోసం సిఫార్సు చేయరు. ఎందుకంటే దాని ఆక్సీకరణ ఒత్తిడి, శ్లేష్మంని సృష్టించే తీరు..ఇతర తీవ్రమైన శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. స్వేదజలం, హైడ్రోజన్ పెరాక్సైడ్ కంటే సురక్షితమైనప్పటికీ అసందర్భంగా ఉపయోగించినట్లయితే ప్రమాదాలను కలిగిస్తుంది. సాధారణ సెలైన్ దాని భద్రతా ప్రొఫైల్ -శరీరం ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌తో అనుకూలత కారణంగా నెబ్యులైజేషన్‌కు ప్రాధాన్యత ఎంపికగా ఉంది'' అని అన్నారు.

హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్ తో సమస్యలను ప్ర‌స్థావిస్తే..హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక బలమైన ఆక్సీకరణ ఏజెంట్. నెబ్యులైజ్ చేసినప్పుడు .. బాగా పీల్చినప్పుడు, ఇది ఆక్సీకరణ ఒత్తిడిని క‌లిగించి ఊపిరితిత్తుల కణజాలాలకు నష్టం కలిగిస్తుందని డాక్ట‌ర్లు చెబుతున్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చడం శ్వాసకోశ శ్లేష్మ పొరను చికాకుపెడుతుంది, ఇది దగ్గు, గొంతు చికాకును పెంచుతుంది. మరింత తీవ్రమైన శ్వాసకోశ బాధకు దారితీస్తుంది. సైటోటాక్సిసిటీ ప్ర‌మాద‌క‌రం. హైడ్రోజన్ పెరాక్సైడ్ శ్వాసకోశంలోని ఎపిథీలియల్ కణాలకు సైటోటాక్సిక్ కావచ్చు.. ఇది కణాల మరణానికి కణజాల నష్టానికి దారితీస్తుందని వైద్యులు విశ్లేషించారు.

అలాంటి డాక్ట‌ర్లు వ్య‌ర్థం:

అయితే స‌మంత డాక్ట‌ర్ల పొట్ట కొడుతోంద‌ని అభిప్రాయ‌ప‌డే నెటిజ‌నుల‌కు కొద‌వేమీ లేదు. అవ‌స‌రం అయినదానికి కాని దానికి వంద‌లు దాటి వేల‌ల్లో ఫీజులు తీసుకుంటున్న డాక్ట‌ర్ల క‌మ‌ర్షియ‌ల్ యాటిట్యూడ్ స‌మంత స‌ల‌హాను మించి ప్ర‌మాద‌క‌రం అని కూడా విశ్లేషిస్తున్నారు. సామాన్యుల‌కు అందుబాటులో ఉండ‌ని వైద్యులు ఉన్నా లేక‌పోయినా ఒక‌టే అని ఏవ‌గించుకుంటున్న నెటిజ‌నుల‌కు కొద‌వేమీ లేదు.