థియేటర్లకు పట్టిన తుప్పు వదలాలి బాస్!
దీంతో అలా మూత పడిన థియేటర్లన్నీ బూజు పట్టాయి. ఇనుప చట్రాలకు తుప్పు పట్టింది. ప్రాంగణం అంత శుద్ది శుభ్రత లేకుండా పోయింది.
By: Tupaki Desk | 22 Jun 2024 12:30 PM GMTకొన్ని నెలలుగా మూత పడిన థియేటర్ల పరిస్థితి ఎలా ఉందో తెలిసిందే. కొత్త రిలీజ్ లు లేక థియేటర్లను తాత్కాలికంగా రెండు రాష్ట్రాల్లోనూ బంద్ పెట్టారు. దీంతో అలా మూత పడిన థియేటర్లన్నీ బూజు పట్టాయి. ఇనుప చట్రాలకు తుప్పు పట్టింది. ప్రాంగణం అంత శుద్ది శుభ్రత లేకుండా పోయింది. మధ్యలో అడపా దడపా చిన్నపాటి సినిమాలు రిలీజ్ అయినా అవి పెద్దగా ఆడలేదు. వాటిని ఓటీటీలో చూసే పరిస్థితి ఉండటంతో! థియేటర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగానే తయారైంది.
మా సినిమా కోసం థియేటర్లు ఓపెన్ చేయండని ఎగ్జిబిటర్లనీ అడుక్కునే పరిస్థితి దాపరించింది నిర్మాతలకు. ఈ మధ్యనే 'మహారాజా' అనే సినిమా రిలీజ్ అయింది. ఈసినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో కొన్ని థియేటర్లు కళకళాడుతున్నాయి. మూత పడిన థియేటర్ల పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు వాటి తుప్పు వదిలించాల్సిన బాధ్యత ప్రభాస్ పైనే ఉంది.
ఆయన కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం 'కల్కి 2898' వచ్చే వారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 27న గురువారం భారీ అంచనాల మధ్య సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాకి మంచి హైప్ క్రియేట్ అయింది. 'సలార్' తర్వాత డార్లింగ్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు రెట్టింపు క్రియేట్ అవుతున్నాయి.
ముఖ్యంగా ఈ సినిమాకి భారీ ఎత్తున బిజినెస్ జరిగింది. 'బాహుబలి', 'ఆర్ ఆర్ ఆర్' లాంటి భారీ వసూళ్ల చిత్రాల రికార్డును తిరగరాస్తుందనే అంచనాలున్నాయి. మరి ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ వాటిని బ్రేక్ చేస్తుందా? లేదా? అన్నది చూడాలి. అలాగే థియేటర్లకు మళ్లీ జనాల్ని అలవాటు చేయాల్సిన అవసరం అంతే ఉంది. ఇదంతా జరగాలంటే తొలి షోతో బ్లాక్ బస్టర్ టాక్ రావాలి.