Begin typing your search above and press return to search.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. బాలయ్య లాంటి కిక్: హైపర్ ఆది

ఇక సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ వేడుకను నేడు గ్రాండ్‌గా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా బాలకృష్ణ హాజరయ్యారు.

By:  Tupaki Desk   |   28 May 2024 5:20 PM GMT
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. బాలయ్య లాంటి కిక్: హైపర్ ఆది
X

కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన "గ్యాంగ్ ఆఫ్ గోదావరి" ఈ నెల 31న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి, దీనికి కారణం ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడమే. ఇక సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ వేడుకను నేడు గ్రాండ్‌గా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా బాలకృష్ణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా సినిమాలో నటించిన హైపర్ ఆది మాట్లాడుతూ, "నందమూరి తారక రామరావు గారి జయంతి రోజే ఈ వేడుక జరగడం చాలా సంతోషంగా ఉంది. ఆయన తెలుగువాడి గర్వకారణం. ఆయన వారసత్వాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లిన బాలకృష్ణ నటుడిగా కాకుండా ఒక మంచి వ్యక్తిగా ఎన్నో మంచి పనులు చేశారు. ఆయన కొట్టారు అని వార్తలు రాస్తారు కానీ, ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా చాలామందికి ప్రాణాలు ఇచ్చారు అని కూడా రాయాలి. బాలకృష్ణ గారి ఎనర్జీ ఎప్పుడు కూడా తగ్గదు. జనరేషన్ మారితే మనుషులు మారుతారు, టెక్నాలజీలు మారుతాయి కానీ బాలయ్య బాబు ఎనర్జీ మారదు.

మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అలాంటి ఎనర్జీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలయ్య బాబు ఈ సినిమా వేడుకకు వచ్చినందుకు సంతోషంగా ఉంది, మా సినిమా కూడా అన్‌స్టాపబుల్ గా నిలవాలని కోరుకుంటున్నాను. ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. మా సినిమా ఎలా ఉండబోతుంది అంటే.. పది నిమిషాల ముందు క్లోజ్ అయ్యే పబ్ ముందట జై బాలయ్య అనే స్లొగన్స్ వస్తే ఎంత కిక్కు ఉంటుందో ? మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అంతే తరహాలోకి కిక్ ఇస్తుంది. బాలకృష్ణ గారి సినిమాల్లో సెకండ్ హాఫ్ లో వచ్చే క్యారెక్టర్ ఎంత కిక్కిస్తుందో ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కూడా అంతే ఎక్కువ కిక్ ఇస్తుంది.

ఫైనల్ గా మెన్షన్ హౌస్ వేస్తే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అంతే కిక్ ఇస్తుంది. బాలయ్య బాబు గారి పర్మిషన్ తో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. రేపు పొద్దున్న నందమూరి నటసింహం, కొణిదల కొదమసింహం అసెంబ్లీలో అడుగుపెడితే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అంతే కిక్ ఇస్తుంది. ఈ సినిమాలో విశ్వక్సేన్ చేసిన జాతర మామూలుగా లేదు.

రేపు పొద్దున థియేటర్స్ లో మీరందరూ ఆ జాతర చూస్తారు. అతనితో సినిమా చేస్తే పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయి. లేకపోతే లాభాలు వస్తాయి. అలాంటి హీరో అతను. 24 క్రాఫ్ట్స్ మీద పట్టున్న వ్యక్తి మన విశ్వక్సేన్ గారు. అలాంటి వ్యక్తికి ఈ సినిమా మంచి విజయాన్ని ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు ఈ సినిమాలో చాలా పవర్ఫుల్ డైలాగ్స్ రాశారు. ఆయన అంటే త్రివిక్రమ్ గారికి చాలా ఇష్టం.

ఈ సినిమాలో ఉండే డైలాగ్స్ మామూలుగా ఉండవు. అవన్నీ కూడా ఎంజాయ్ చేస్తారు. సినిమాలో అంజలి కూడా చాలా అద్భుతంగా నటించారు. ఇందులో రత్నమాల క్యారెక్టర్ లో చాలా కొత్తగా కనిపించబోతోంది. హీరోయిన్ నేహా శెట్టి కూడా అద్భుతంగా నటించింది. అలాగే సోషల్ మీడియాలో రివ్యూర్లకు కూడా నేను ఒక విషయాన్ని చెబుతున్నాను. మీరు తెలుగు పరిశ్రమను కాపాడాల్సిన అవసరం ఉంది. ఒక తెలుగు నిర్మాతను తెలుగు సినిమాను బ్రతికించాల్సిన అవసరం మీకు ఉంది అని ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని నమ్మకంతో చెబుతున్నాను అంటూ హైపర్ అది వివరణ ఇచ్చారు.