నాపై కుట్ర చేసిన వారి పేర్లు CBIకి చెప్పాను: రాజ్ కుంద్రా
నేను నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నేను ఏదో దాస్తున్నానని ప్రజలు అనుకుంటారు. ప్రజలు నిజం గ్రహించాలి.. కుటుంబాన్ని లాగారు కాబట్టి బయటకు వచ్చి మాట్లాడాలనుకుంటున్నాను! అని కుంద్రా అన్నారు.
By: Tupaki Desk | 17 Dec 2024 7:11 AM GMTటాప్ మోడల్స్, D గ్రేడ్ నటీమణులతో అశ్లీల చిత్రాలు తెరకెక్కించారనే ఆరోపణలపై వివాదంలో చిక్కుకున్న వ్యాపారవేత్త రాజ్ కుంద్రా మూడేళ్ల తర్వాత తన మౌనాన్ని వీడారు. ఈ కేసులో అన్ని ఊహాగానాలను ఆయన కొట్టి పారేసారు. తనకు అశ్లీల సినిమాలతో ఎలాంటి సంబంధం లేదని, తాను అలాంటి సినిమాలు తీయలేదని అన్నారు. రాజ్ కుంద్రా ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివాదాస్పద అంశంపై తన మౌనాన్ని వీడారు. మీడియాలో చాలా ఊహాగానాలు తనపై వచ్చాయి. అయినా నిశ్శబ్దంగా ఉన్న కుంద్రా దానిపై ఎందుకు మౌనంగా ఉన్నాడో వెల్లడించాడు. తన కుటుంబం వివాదంలో చిక్కుకున్నప్పుడు నిశ్శబ్ధంగా ఉండలేకపోయానని, అందుకే బయటకు వచ్చి వివరణ ఇస్తున్నానని అన్నాడు.
నేను నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నేను ఏదో దాస్తున్నానని ప్రజలు అనుకుంటారు. ప్రజలు నిజం గ్రహించాలి.. కుటుంబాన్ని లాగారు కాబట్టి బయటకు వచ్చి మాట్లాడాలనుకుంటున్నాను! అని కుంద్రా అన్నారు. బ్రిటన్ నుంచి అశ్లీల యాప్ లను నిర్వహించారని కుంద్రాపై ఆరోపణలొచ్చాయి. ఈ యాప్‌ను రన్ చేస్తున్న సోదరుడి కంపెనీకి తాను సాంకేతిక సేవలను మాత్రమే అందించానని కుంద్రా స్పష్టం చేశాడు.
ఇప్పటి వరకు.. నేను ఎలాంటి అశ్లీల చిత్రాలలో లేదా పో*గ్రఫీలో భాగం కాలేదు. అలాంటి పనులేవీ చేయలేదు. నాపై ఆరోపణలకు చాలా బాధపడ్డాను.. ఆధారాలు లభించకపోవడం వల్లనే తనకు బెయిల్ వచ్చిందని కుంద్రా అన్నారు. నేను యాప్‌ను నడిపినంత కాలం నా కొడుకు పేరు మీద ఒక లిస్టెడ్ కంపెనీ ఉంది. బ్రిటన్ లోని మా బావ కంపెనీ కెన్రిన్‌కి టెక్నాలజీ సేవలను అందించాము. అతడు UK నుండి యాప్‌ను ప్రారంభించాడు. ఇది ఖచ్చితంగా బోల్డ్‌గా ఉంటుంది. ఇది పాతతరం ప్రేక్షకుల కోసం రూపొందించినది. ఇవి A- రేటెడ్ సినిమాలు కానీ అశ్లీలమైనవి కావు... నా ప్రమేయం విషయానికొస్తే.. కేవలం టెక్నాలజీ ప్రొవైడర్‌గా ఉన్నాను.. అని వివరణ ఇచ్చారు కుంద్రా.
కుంద్రా నడిపించిన యాప్ కోసం నటించానని ఎవరైనా మోడల్ ని ముందుకు రమ్మని చెప్పండి. మొత్తం 13 యాప్‌ల కింగ్‌పిన్.. నేను సాఫ్ట్‌వేర్ టెక్నాలజీని అందిస్తున్నాను. యాప్ లలో తప్పులేవీ జరగలేదు అని కుంద్రా వాదించారు. మూడేళ్లుగా కోర్టులో పోరాడుతున్నానని, న్యాయ ప్రక్రియపై నమ్మకం ఉందని కుంద్రా అన్నారు.
నేను ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు కాబట్టి నేను ఈ కేసులో గెలుస్తానని నాకు నమ్మకం ఉందని.. న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నానని..అన్నారు. వ్యాపారంలో వైరమే తనపై వ్యక్తిగత దాడికి దారితీసిందని కుంద్రా పేర్కొన్నాడు. నేను నా పనిలో ఉండగా అర్ధరాత్రి ఒకరు నా వద్దకు వచ్చి గొడవపడ్డారు. నాపై ఎవరు కుట్ర పన్నారో అప్పుడే నేను గ్రహించాను! అని రాజ్ కుంద్రా అన్నారు. నా ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర వెనుక ఎవరు ఉన్నారో వ్యక్తుల పేర్లను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి లేఖ రాశానని కుంద్రా వెల్లడించాడు. అయితే బహిరంగంగా వారి పేర్లను అతడు వెల్లడించలేదు. అశ్లీల యాప్ ల కేసుతో పాటు, కుంద్రా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నుండి మనీలాండరింగుకు సంబంధించిన విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.