నేను తరుణ్ భాస్కర్ అంటే.. అయితే ఏంటీ అన్నారాట
ఈ సందర్భంగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తనకు ఎదురైన ఆసక్తికరమైన విషయాన్ని ఈ సందర్భంగా షేర్ చేసుకున్నారు.
By: Tupaki Desk | 12 Oct 2023 10:11 AMపెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది? వంటి సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు యంగ్, అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. విక్టరీ వెంకటేష్‌తో సినిమా చేయాలని విశ్వప్రయత్నాలు చేసి కొన్నేళ్ల టైమ్ వేస్ట్ చేసిన తరుణ్ భాష్కర్ ఫైనల్‌గా మళ్లీ తన ఫ్యార్మాట్‌లోకే వచ్చేసి చేస్తున్న సినిమా `కీడాకోలా`. చైతన్య రావు, రాగ్ మయూర్, రవీంద్ర విజయ్, రఘురామ్‌లతో కలిసి ప్రధాన పాత్రల్లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం నటించారు. నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సినిమా రిలీజ్‌కు దాదాపు నెల రోజుల సమయం ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తనకు ఎదురైన ఆసక్తికరమైన విషయాన్ని ఈ సందర్భంగా షేర్ చేసుకున్నారు. బ్రహ్మానందంని కీ రోల్ కోసం అనుకున్నాక ఆయన తనయుడు గౌతమ్‌తో మాట్లాడారట. తన కారణంగానే బ్రహ్మానందంని కలిశారట. అయితే ఆ సమయంలో బ్రహ్మానందంని కలవడానికి వెళ్లి నేను తరుణ్ భాస్కర్ అన్నారట.
వెంటే ఆయన అయితే ఏంటీ? నువ్వేమైనా ప్రెసిడెంట్‌వా అన్నారట. దీంతో తరుణ్ భాష్కర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారట. అలా తరుణ్ భాస్కర్‌ని బ్రహ్మానందం కంగారు పెట్టడానికి కారణం ఉందట. టీమ్ అంతా కొంచెం నెర్వస్‌గా ఉన్నారు డాడీ వాళ్లతో కొంచెం మిగిల్ అయిపోయి ఫ్రీగా మాట్లాడండి అని గౌతమ్ చెప్పాడట. దాంతో కామెడీ చేయాలని భావించిన బ్రహ్మానందం ..తరుణ్ భాష్కర్‌ని అలా అన్నారట. ఆ తరువాత ప్రాజెక్ట్ ఓకే చేసి సెట్‌లోకి వెళ్లాక టీమ్ అంతా తనని ఓ యాక్టర్‌గా చూడలేదని, తనని ఓ ఫాదర్‌గా, పెద్ద మనిషిగా చూశారని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.
తనని సెట్‌లో గౌరవించడం కంటే అంతా ప్రేమించారట. ఆ కాన్సెప్ట్‌ని నేను చాలా ఇష్టపడ్డాను. ఇక క్యారెక్టర్ విషయంలో తరుణ్ భాస్కర్‌కు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో తెలియదు కానీ `బ్రహ్మానందాన్ని వీల్ చైర్‌లో కూర్చోబెట్టి..చేయించిన కామెడీ మామూలుగా లేదు. ఆ పాత్రకు అతిమూత్ర వ్యాధి ఉంటుంది. దానిపై చైతన్య, విష్ణు పంచ్‌లు వేస్తుంటారు. ఈ టీమ్‌తో కలిసి పని చేయడం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది` అంటూ చెప్పుకొచ్చారు బ్రహ్మానందం.