Begin typing your search above and press return to search.

కొత్త కార్ కొన్న యువ‌హీరో.. ఇంటికొచ్చి దిష్ఠి తీసిన‌ ప్రియురాలు!

పాలకోవా లాంటి బ్యూటీతో వంద‌ల కోట్ల ఆస్తులు ఉన్న‌ న‌ట‌వార‌సుడి ప్రేమాయ‌ణం ఇప్పుడు స‌ర్వ‌త్రా గుస‌గుస‌ల‌కు తావిస్తోంది.

By:  Tupaki Desk   |   11 Jun 2024 3:30 PM GMT
కొత్త కార్ కొన్న యువ‌హీరో.. ఇంటికొచ్చి దిష్ఠి తీసిన‌ ప్రియురాలు!
X

అత‌డు వంద‌ల కోట్ల ఆస్తులు ఉన్న‌ పెద్ద స్టార్ హీరో కుమారుడు. ఆమె ప్ర‌ముఖ న‌టి కుమార్తె. ఆ ఇద్ద‌రూ చెట్టాప‌ట్టాల్ అంటూ షికార్ చేయ‌డం ఇటీవ‌ల మీడియాలో చ‌ర్చ‌గా మారింది. ఆ ఇద్ద‌రూ డేటింగ్ లో ఉన్నారంటూ ఆధారాల‌ను బ‌య‌ట‌పెడుతున్నారు నెటిజ‌నులు. ఈ అంద‌మైన జంట ఓసారి గోవా బీచ్ లో చిల్ అవుతూ క‌నిపించారు. ఇప్పుడు నేరుగా అత‌డి ఇంటికే వ‌చ్చిన ఆమె పార్టీలో చేరింది. అత‌డు కొన్న కొత్త కార్ లో షికార్ వెళ్లేందుకు, పార్టీని సెల‌బ్రేట్ చేసుకునేందుకు అత‌డి ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు ప్రియురాలు కెమెరాల కంటికి చిక్కింది. ప్ర‌స్తుతం ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. ఈ ఎపిసోడ్ లో న‌ట‌వార‌సుడు మ‌రెవ‌రో కాదు. ఇబ్ర‌హీం అలీఖాన్.. బాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు సైఫ్ అలీఖాన్ కుమారుడు. ఆమె ప్ర‌ముఖ న‌టి శ్వేతా తివారీ వార‌సురాలు పాల‌క్ తివారీ. పాలకోవా లాంటి బ్యూటీతో వంద‌ల కోట్ల ఆస్తులు ఉన్న‌ న‌ట‌వార‌సుడి ప్రేమాయ‌ణం ఇప్పుడు స‌ర్వ‌త్రా గుస‌గుస‌ల‌కు తావిస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే...

యువ జంట ఇబ్రహీం అలీఖాన్ - పాలక్ తివారీ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్లు ముంబై మీడియా క‌థ‌నాలు వండి వారుస్తోంది. ఈ జంట సోమవారం రాత్రి సైఫ్ ఖాన్ నివాసంలో పార్టీ చేసుకున్నారు. ఇబ్రహీం సోమవారం నాడు ఒక‌ సరికొత్త లగ్జరీ కారును కొనుగోలు చేసాడు. అందువ‌ల్ల‌ అతడి ముంబై నివాసానికి వెళ్లి కొత్త‌ కారును గ్యారేజీలోకి స్వాగతించిన మొదటి వ్య‌క్తుల్లో త‌న స్నేహితురాలు పాలక్ ఉంది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న వీడియోలో ఇబ్రహీం తన కొత్త BMW X5 కారును ఇంటికి తీసుకు వ‌స్తూ క‌నిపించాడు. దీని ధర ముంబైలో రూ. 1.13 కోట్లు.

23 ఏళ్ల ఇబ్ర‌హీం త్వరలో హీరోగా బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. ఇంకా హీరో అవ్వ‌క ముందే తన మొదటి కారును కొనుగోలు చేసినందుకు బాలీవుడ్ స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్లు అతనిని అభినందించారు. ఈ కార్ కొనుగోలు కోసం ఇబ్ర‌హీం త‌న వ్య‌క్తిగ‌త సంపాద‌న‌ను వెచ్చించాడు. అందుకే పాలక్ అతడితో వ్యక్తిగతంగా సాధించిన విజయాన్ని సెల‌బ్రేట్ చేసేందుకు ఇంటికి వ‌చ్చింది. ఆ ఇద్ద‌రూ ఈ సెల‌బ్రేష‌న్ స‌మ‌యంలో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా క‌నిపించార‌ని చెబుతున్నారు.

ఇబ్రహీం - పాలక్ డేటింగ్ గురించి కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నాయి. 2022 జనవరిలో ఓరోజు విందు ముగించి ఇద్దరూ రెస్టారెంట్ నుండి బయటికి వచ్చినప్పుడు పాలక్ స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ల‌కు చిక్క‌కుండా తన ముఖాన్ని దాచుకోవడం కనిపించింది. అప్ప‌టి నుంచి ఆ ఇద్ద‌రిపైనా ర‌క‌ర‌కాల గాసిప్స్ షికార్ చేస్తున్నాయి. వారిద్దరూ తాము కేవలం మంచి స్నేహితులం మాత్ర‌మేన‌ని చెబుతున్నారు. వారు తరచుగా కలిసి పార్టీలకు హాజరవుతూ విహారయాత్రలకు కూడా క‌లిసి వెళుతున్నారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా జ‌రుగుతున్న‌ది ఏమిటో వారే అధికారికంగా క‌న్ఫామ్ చేయాల్సి ఉంటుంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. పాలక్ 2023లో సల్మాన్ ఖాన్ న‌టించిన `కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌`తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అంత‌కుముందు ఈ బ్యూటీ బిజిలీ బిజ్లీ అనే మ్యూజిక్ వీడియోతో పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సంజయ్ ద‌త్‌- మౌని రాయ్‌ల‌తో కలిసి `ది వర్జిన్ ట్రీ`లో కనిపించనుంది. ఇబ్రహీం అలీ ఖాన్ ముంబైలో న్యూ ఇయర్ పార్టీ తర్వాత గాళ్ ఫ్రెండ్ పాలక్ తివారీతో తిరిగి వ‌స్తూ విమానాశ్ర‌యంలో కెమెరాల‌కు చిక్కిన‌ప్పుడు అత‌డు త‌న‌ ముఖం దాచుకున్నాడు. ఇబ్రహీం విషయానికొస్తే.. సైఫ్ అలీ ఖాన్ - అమృతా సింగ్ జంట‌ కుమారుడు. అత‌డు `సర్జమీన్` అనే చిత్రంతో త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నాడు. ఇందులో కాజోల్ ప్ర‌ధాన పాత్ర‌ధారి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచారు.