Begin typing your search above and press return to search.

అందుకే అత‌డు స్టైలిష్ ఐకాన్ స్టార్

తాజాగా బ‌న్ని స్టైలిష్ లుక్ ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. బ‌హుశా ఇది త్రోబ్యాక్ ఫోటో

By:  Tupaki Desk   |   3 March 2024 4:21 AM GMT
అందుకే అత‌డు స్టైలిష్ ఐకాన్ స్టార్
X

స్లైలిష్ స్టార్.. ఐకాన్ స్టార్... అల్లు అర్జున్ బిరుదులివి. అభిమానులు ఇచ్చిన బిరుదు స్టైలిష్ స్టార్.. త‌న ఫేవ‌రెట్ ద‌ర్శ‌కుడు సుకుమార్ ఇచ్చిన బిరుదు ఐకాన్ స్టార్. ఏ ర‌కంగా పిలిచినా బ‌న్నీకి ఈ పిలుపు ప‌క్కా యాప్ట్. మావ‌య్య,లెజెండ‌రీ క‌థానాయ‌కుడు చిరంజీవి స్ఫూర్తితో తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించిన స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నాడు. పుష్ప చిత్రంతో నార్త్ కి మైండ్ బ్లాక్ చేసాడు. టాలీవుడ్ లో మొట్ట‌మొద‌టి జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అత‌డు ఒక‌ చ‌రిత్ర‌కారుడే అయ్యాడు. పుష్ప సినిమా చూశాక‌.. ``నీ నుంచి నేను ఏదైనా నేర్చుకోవాలి!`` అంటూ కింగ్ ఖాన్ షారూఖ్ అంత‌టి వారే.. బ‌న్నీని కీర్తించారంటే అది అత‌డి ఎదుగుద‌ల‌, న‌ట ప్ర‌తిభ‌కు ద‌క్కిన గౌర‌వంగా భావించాలి. యీ పొగ‌డ్త జాతీయ అవార్డును మించిన‌ది..!

స్టైల్ కంటెంట్ ప‌రంగాను ఇప్పుడు బాలీవుడ్ స్టార్ల‌కు ధీటుగా ఐకాన్ స్టార్ తానేంటో నిరూపిస్తున్నాడు. బాలీవుడ్ లో హృతిక్ రోష‌న్, ర‌ణ‌వీర్ సింగ్ లాంటి స్టార్లు స్టైల్ కి ప‌ర్యాయ‌ప‌దంగా క‌నిపిస్తారు. ఇప్పుడు అదే రేంజులో మ‌రో స్టార్ ఎవ‌రైనా ఉన్నారు అంటే అది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన‌డంలో సందేహం లేదు. ర‌ణ‌వీర్ సింగ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ల స్ఫూర్తితోనే విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా స్టైల్ ఐకాన్ గా మారాడు. బ‌న్ని నేటిత‌రం హీరోల‌కు ఒక స్ఫూర్తి.

తాజాగా బ‌న్ని స్టైలిష్ లుక్ ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. బ‌హుశా ఇది త్రోబ్యాక్ ఫోటో. ఇందులో బ్లాక్ ష‌ర్ట్ ధ‌రించి.. ఫంకీ లాంగ్ హెయిర్ స్టైల్ తో అతడు ఎంతో స్టైలిష్ గా క‌నిపిస్తున్నాడు. ఎంపిక చేసుకున్న గాగుల్స్ అంతే స్పెష‌ల్ గా కనిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. అల్లు అర్జున్ ఈ ఫోటోలో ఎంతో స్టైలిష్ గా క‌నిపిస్తున్నాడంటూ అభిమానులు కితాబిస్తున్నారు. స్టైల్ కంటెంట్ ఒక చైన్ సిస్ట‌మ్ లా మారింది. ఇది సాధార‌ణ ఫ్యాన్స్ ని కూడా ఎంతో ఆక‌ర్షిస్తోంది. తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో దీనికి ఆద్యుడిగా అల్లు అర్జున్ పేరు సుస్థిర‌మైంది. బ‌న్ని న‌టిస్తున్న తాజా చిత్రం పుష్ప 2 పాన్ ఇండియా కేట‌గిరీలో విడుద‌ల కానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు బ్రేక్ చేయ‌డం ఖాయ‌మ‌న్న అంచ‌నాలున్నాయి. పుష్ప ను విప‌రీతంగా ప్రేమించిన ఉత్త‌రాది ఆడియెన్ ఈ మూవీ కోసం ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. గంధ‌పు చ‌క్క‌ల స్మ‌గ్ల‌ర్ గా పుష్ప‌రాజ్ విన్యాసాలు వీక్షించేందుకు ప్ర‌పంచం అంతా ఎగ్జ‌యిటింగ్ గా ఎదురు చూస్తోంది. పుష్ప 2 ఈ ఏడాదిలోనే విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.