Begin typing your search above and press return to search.

స్టార్ సినిమా.. వారంలోనే ఓటీటీ రిలీజ్..!

ఇదిలా ఉంటే స్టార్ హీరో సినిమా రిలీజైన వారం లోనే ఓటీటీ రిలీజ్ అవుతుంది.

By:  Tupaki Desk   |   25 Jan 2025 4:30 AM GMT
స్టార్ సినిమా.. వారంలోనే ఓటీటీ రిలీజ్..!
X

సినిమా రిలీజ్ డేట్స్ ని శాసిస్తున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ల గురించి ఇప్పటికే నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే ఒక సినిమాకు ఓటీటీ రైట్స్ అమ్మడం. వాళ్లకు రిలీజ్ డేట్ ఒకటి చెబితే ఆ టైం కు వారు ఆ రిలీజ్ ని లాక్ చేయడం. ఐతే ఏదైనా కారణాల వల్ల సినిమా థియేట్రికల్ రిలీజ్ లేట్ అయినా కూడా ఓటీటీ రిలీజ్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గకపోవడం తెలిసిందే.

స్టార్ సినిమాలకు ఈ ఓటీటీ రిలీజ్ టెన్షన్ కామన్ అయ్యింది. హిట్ సినిమాలకు ఇదేమంత ఎఫెక్ట్ చూపించదేమో కానీ కాస్త నిరాశ పరిచిన సినిమాలకు మాత్రం గట్టి దెబ్బే వేస్తుంది. ఇదిలా ఉంటే స్టార్ హీరో సినిమా రిలీజైన వారం లోనే ఓటీటీ రిలీజ్ అవుతుంది. మలయాళ స్టార్ టొవినో థామస్ నటించిన ఐడెంటిటీ సినిమా 2025 జనవరి 2న మలయాళంలో గ్రాండ్ రిలీజైంది.

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను అఖిల్ పాల్, అనాస్ ఖాన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో టొవినో థామస్ తో పాటుగా త్రిష స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మలయాళ సినిమాలో క్రైం థ్రిల్లర్ సినిమాలు సెపరేట్ ట్రీట్మెంట్ తో వస్తాయి. టొవినో థామస్ నటించిన ఐడెంటిటీ కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఐతే ఈ సినిమాను జనవరి 24న తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. తెలుగులో టొవినో థామస్ నటించిన సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడింది.

అందుకే అతను నటించిన ఐడెంటిటీ తెలుగులో రిలీజ్ చేశారు. ఐతే తెలుగు వెర్షన్ రిలీజైన వారం లోనే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. జీ 5 ఐడెంటిటీ సినిమా జనవరి 31న రిలీజ్ లాక్ చేసింది. అంటే సినిమా రిలీజైన వారం లోనే ఓటీటీలోకి వస్తుందన్నమాట. స్టార్ సినిమాలకు ఓటీటీ ఎంత ఇంపాక్ట్ కలిగిస్తుంది అన్నది మరోసారి ప్రూవ్ అవుతుంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలన్నది కూడా ఓటీటీ సంస్థలు డిసైడ్ చేస్తున్నారు అంటే తప్పకుండా వాటిపై నిర్మాతలు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఐడెంటిటీ సినిమా తెలుగు థియేట్రికల్ రిలీజైన వారం లోనే ఓటీటీ లో అందుబాటులోకి రావడం సినిమా తెలుగు కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడేలా చేస్తుందని చెప్పొచ్చు.