రష్మిక.. మరొక్కటి పడితే రెమ్యునరేషన్ ఆ లెవెల్లోనే..
దీని తర్వాత తాజాగా వచ్చిన 'పుష్ప 2' సినిమా ఏకంగా ఆరు రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.
By: Tupaki Desk | 13 Dec 2024 8:30 AM GMTపాన్ ఇండియా హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన. 'పుష్ప' సినిమా తర్వాత రష్మిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. 'యానిమల్' మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిత్రం 900 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంది. దీని తర్వాత తాజాగా వచ్చిన 'పుష్ప 2' సినిమా ఏకంగా ఆరు రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.
ఈ సినిమా లాంగ్ రన్ లో 1500 కోట్ల వరకు వసూలు చేస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో రష్మిక లక్కీ చార్మ్ గా మారిపోయింది. ఓ వైపు తన అందంతో అందరిని ఆకట్టుకుంటూనే మరో వైపు నటనతో కూడా ప్రేక్షకులని ఫిదా చేస్తోంది. అందుకే రష్మికకి సాలీడ్ క్రేజ్ వచ్చేసింది. ఆమె రెమ్యునరేషన్ కూడా అమాంతం పెంచేసింది. అయిన కూడా స్టార్ హీరోల ఫస్ట్ ఛాయస్ గా ఈ బ్యూటీ ఉంది.
ఇదిలా ఉంటే రష్మిక మరోసారి రణబీర్ కపూర్ తో 'యానిమల్ పార్క్' మూవీలో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. 'యానిమల్' కి సీక్వెల్ గా తెరకెక్కనున్న సినిమా కావడంతో 'యానిమల్ పార్క్' పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మొదటి సినిమాకి మించిన క్యారెక్టర్ తో ఈ సీక్వెల్ ఉండబోతోందనే హింట్ ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా ఇచ్చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన ఈ 'యానిమల్ పార్క్' గురించి చూచాయగా కొన్ని హిట్స్ ఇచ్చింది. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా ఈ సీక్వెల్ స్టోరీ వన్ లైన్ ఆర్డర్ చెప్పారని తెలిపింది. ఈ సీక్వెల్ మొదటి సినిమా కంటే మరింత అడ్వాన్స్ వెర్షన్ గా ఉంటుందని రష్మిక చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రష్మిక చెప్పింది.
ఇక ఈ మూవీ 2000 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకోవడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ద్వారా రష్మిక కచ్చితంగా అరుదైన ఫీట్ ని అందుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోలు వెయ్యి కోట్లు, 1500 కోట్లు, 2 వేల కోట్లు అంటూ టార్గెట్స్ పెట్టుకోగా రష్మిక సైతం అలాంటి సినిమాలలో భాగం అవుతుండడం విశేషం.
ఇక అమ్మడు ఆ రేంజ్ ఫలితాలు అందుకోగలిగితే రెమ్యునరేషన్ లెక్క 10 కోట్లను దాటించే అవకాశం ఉంటుంది.
'పుష్ప' మూవీ 300 కోట్లు కలెక్ట్ చేస్తే దానికి కొనసాగింపుగా వచ్చిన 'పుష్ప 2' ఏకంగా 3 రేట్లు అధికంగా వసూళ్లు చేసింది. హిందీ బెల్ట్ లో అయితే ఏకంగా 6 రేట్లు అధిక కలెక్షన్స్ అందుకుంది. ఇదే లెక్కన చూసుకుంటే 'యానిమల్' కి సీక్వెల్ గా రాబోయే 'యానిమల్ పార్క్' ఏ రేంజ్ లో కలెక్ట్ చేస్తుందనేది ప్రేక్షకుల ఊహలకే వదిలేయాలి.