యాక్షన్ చెప్పే స్టార్ మేకర్స్ అంతా యాక్షన్ లోకి దిగిపోతే ఎలా?
అలాగే కోలీవుడ్ లో మెస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ అయిన మిస్కిన్ కూడా స్టార్ హీరోల చిత్రాల్లో నటించడం తగ్గేదే లే అంటున్నాడు.
By: Tupaki Desk | 16 Oct 2023 7:12 AM GMTస్టార్ డైరెక్టర్లంతా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఫుల్ బిజీ అవుతున్నారా? కెప్టెన్ కుర్చీ కంటే నటుడిగా మ్యాకప్ వేసుకోవడానికి అమితాసక్తి చూపిస్తున్నారా? పేరున్న దర్శకులు ఇలా క్యారెక్టర్ టర్నింగ్ తీసుకోవడం స్టార్ హీరోలకి ఇబ్బందిగా మారుతుందా? అనుకూలంగా ఉంటుందా? అంటే ఆసక్తికర సంగతులే తెలుస్తు న్నాయి. కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ సినిమాల్లో కీలక పాత్రలు..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించడం అన్నది కొత్త కాదు.
ఆయన చాలా కాలంగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇటీవలి కాలంలా ఆ వేగం మరింత పెంచారు. దర్శకత్వం కంటే నటుడిగా మెప్పించడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. సక్సెస్ ఫుల్ క్రియేటివ్ మేకర్ ఆఫర్ చేసిన ఏ రోల్ విడిచి పెట్టడం లేదు. రోల్ చిన్నదైనా తన మార్క్ పడుతుంటే కమిట్ అవుతు న్నారు. ఆయన్ని చూసే ఎస్. జె. సూర్య కూడా బిజీ అవుతున్నాడు. ఇప్పుడీయన పూర్తిగా నటనవైపే ఆసక్తి చూపిస్తున్నారు.
అలాగని దర్శకత్వాన్ని విడిచి పెట్టలేదు. మహేష్ లాంటి హీరోకి ఓ హిట్ ఇవ్వాల్సి బాధ్యత ఉందంటూ స్టేమెంట్లు ఇస్తూనే నటుడిగా అవకాశాలు వస్తే ఏ ఛాన్స్ మిస్ చేయడం లేదు. ప్రస్తుతం ఆయన జాబితాలో చాలా సినిమాలే ఉన్నాయి. ప్రతి నాయకుడిగా ఆయనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీని వేసారు. అలాగే కోలీవుడ్ లో మెస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ అయిన మిస్కిన్ కూడా స్టార్ హీరోల చిత్రాల్లో నటించడం తగ్గేదే లే అంటున్నాడు. తనకన్నా జూనియర్లు ఆఫర్లు ఇస్తే ఎస్ అంటూ దూసుకు పోతున్నారు.
చిన్న రోల్ అయినా మ్యాకప్ లో ఉండే కిక్కే వేరంటున్నారు. అలాగే బాలీవుడ్ ఫేమస్ హీరో కమ్ డైరెక్టర్ పర్హాన్ అక్తర్ కూడా అంతే. ఎన్నో మంచి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. ప్రస్తుతం యాక్టింగ్..డైరెక్షన్ అంటూ రెండు శాఖలపైనా సీరియస్ గా పనిచేస్తున్నారు. ఇండస్ట్రీలో ఇలా తెలివైన దర్శకులంతా నటులుగా బిజీ అవ్వడం ఇండస్ట్రీకి కొంత వరకూ నష్టమే.
వీళ్లంతా దర్శకులుగా సినిమాలు చేస్తే హీరోలకు...నిర్మాతలకు ఎంతో మేలు. కోట్ల రూపాయ లు..ప్రేక్షకులకు కావాల్సిన గొప్ప వినోదాన్ని అందిచగలరు. క్రియేటివ్ వర్క్ అనేది అంత ఈజీ కాదు. అందరికీ సాద్యమయ్యే పని కాదు. కొంత మంది మాత్రమే యూనిక్ గా సినిమాలు చేసి మెప్పించగలరు. అందులో ఈ నలుగరు మోస్ట్ వాంటెడ్ మేకర్స్ గా పేరు సంపాదించిన వారు.
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కూడా ఈ మధ్య మ్యాకప్ పై ఆసక్తి పెంచుకున్నట్లు కనిపిస్తుంది. `గాడ్ ఫాదర్` లో జర్నలిస్ట్ పాత్రతో ఆకట్టుకున్నారు. అంతకు ముందు తనయుడు ఆకాష్ నటించిన `రొమాంటిక్` సినిమాలో ఓ పాటలో కనిపించారు. ఆరకంగా తన అవసరం..సందర్భం వచ్చిందనుకుంటే పూరి మరో ఆలోచన లేకుండా కెమెరా ముందుకొచ్చేస్తున్నారు. ఇటీవలే శ్రీకాంత్ అడ్డాల కూడా `పెదకాపు` లో కీలక పాత్రతో మెప్పించాడు. ఆ సినిమాతో శ్రీకాంత్ మంచి దర్శకుడే కాదు..నటుడని నిరూపించాడు.