దేవుణ్ణి నమ్మితే గందరగోళం..గుండెనొప్పి
సాధారణంగా మీడియా ముందకు అలా మాట్లాడితే సినిమా మార్కెట్ కోసమని భావిస్తారు.
By: Tupaki Desk | 14 Dec 2023 7:03 AM GMTకూల్ అండ్ కామ్ గయ్..హీరో కం డైరెక్టర్ విజయ్ ఆంటోనీ గురించి చెప్పాల్సిన పనిలేదు. తమిళ నటుడైనా తెలుగు ప్రేక్షకులకు ఎంతో బాగా దగ్గరైన నటుడు. కంటెంట్ బేస్డ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు. ఎప్పటికప్పుడు తెలుగు అభిమానలు తనపై చూపించే ప్రేమాభిమానా లుగరించి మీడియా సమక్షంలో ఎంతో గొప్పగా చెబుతాడు. సాధారణంగా మీడియా ముందకు అలా మాట్లాడితే సినిమా మార్కెట్ కోసమని భావిస్తారు.
కానీ విజయ్ ఆంటోనీ వ్యాఖ్యలు మాత్రం నిజంగా మనసులోతుల్లోనుంచి వచ్చినట్లే ఉంటాయి. అతను మాట్లాడటమే చాలా తక్కువ. వీలైనంత వరకూ కామ్ గా ఉంటాడు. అవసరమైతే నే మాట్లాడుతాడు. ఇక అతని భార్య ఫాతిమా అంతే కామ్ గోయింగ్. విజయ్ నటించిన ఏ సినిమా ప్రచారానికైనా ఆమె తప్పకుం డా హాజరవుతుంటారు. డైరెక్షన్..మ్యూజిక్ ..నటన వంటి పనుల్లో నిత్యం విజయ్ బిజీగా ఉంటే..నిర్మాణా నికి సంబంధించిన వ్యవహరాలన్నీ ఫాతిమా దగ్గరుండి చూసుకుంటారు.
విజయ్ నటించిన చాలా సినిమాలు సొంత బ్యానర్లోనే ఉంటాయి. ఆ రకంగా విజయ్-ఫాతిమా అంటే ప్రత్యేకమైన అభిమానం తెలుగు అభిమానులు చూపిస్తుంటారు. ఈ దంపతుల పెద్ద కుమార్తె మీరా ఆత్మహత్య తల్లిదండ్రుల్ని ఎంత కృంగదీసిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ విషాదకర ఘటన నుంచి విజమా- ఫాతిమా ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు.
తాజాగా ఫాతిమా మరోసారి కుమార్తెను తలచుకుని కన్నీరు మున్నీరయ్యారు. ఆ దేవుడిపైనా ఫాతిమా తన అయిష్టాన్ని వ్యక్త పరిచారు. ఇకపై తాను దేవుడిని నమ్మనని... తనకు అవసరమైన సమయంలో దేవుడు తనతో నిలబడలేదని.. దేవుడిని నమ్ముకుంటే అంతా గందరగోళంగా ఉంటుందని... గుండెనొప్పి తప్ప మరేమీ` ఉండదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. ఫాతిమా వ్యాఖ్యలు చూసి ఆ కుటుంబం ఎంతటి క్షోభకి గురవుతుందో అద్దం పడుతుంది.