ఒక్క ఛాన్స్ ఇస్తే ఇద్దరికీ లాభమే!
దీనికి తోడు తెలుగులో అవకాశాలు రాకపోవడం అనుష్క క్రేజ్ ని క్వశ్చన్ చేసేలా ఉంది సన్నివేశం.
By: Tupaki Desk | 31 Jan 2024 2:30 PM GMT'మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి`తో స్వీటీ అనుష్క కంబ్యాక్ అయినా..ఆ సినిమా హిట్ అయినా ఏమంత కిక్ దొరకలేదు. నిజానికి ఆ సినిమా అనుష్క రేంజ్ హిట్ కాదనే చెప్పాలి. అనుష్క హిట్ కొట్టిందేంటే మార్కెట్ ఓ వైబ్ క్రియేట్ అవ్వాలి. కానీ పొలిశెట్టి విషయంలో అదెక్కడా కనిపించలేదు. దీంతో అనుష్క కంబ్యాక్ అయినా కానట్టే కనిపిస్తుంది. దీనికి తోడు తెలుగులో అవకాశాలు రాకపోవడం అనుష్క క్రేజ్ ని క్వశ్చన్ చేసేలా ఉంది సన్నివేశం.
ప్రస్తుతం అమ్మడు మాలీవుడ్ లో కథనార్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. చేతిలో ఉన్న సినిమా ఇదొక్కటే. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విశ్వంభరలో అనుష్క పేరు పరిశీలనలో ఉందని ప్రచారం సాగుతుంది కానీ ఇంకా కన్పమ్ కాలేదు. అలాగే త్రిష పేరు కూడా తెరపైకి వస్తుంది. మరి వీళ్లిద్దరి లో బెస్ట్ ఛాయిస్ ఎవరు? అంటే మెజార్టీ వర్గం అనుష్కనే సూచిస్తుంది.
చిరంజీవికి జోడీగా అనుష్క సరితూగినట్లు గా త్రిష బ్యాలెన్స్ కాదనే విమర్శ వినిపిస్తుంది. పైగా త్రిషని తీసుకుంటే చిరంజీవికి జోడీగా అది రిపీటెడ్ వెర్షన్ అవుతుంది. ఇప్పటికే వాళ్లిద్దరు స్టాలిన్ లో నటించిన సంగతి తెలిసిందే. అనుష్క కూడా సైరా నరసింహారెడ్డిలో నటించినా ఆ పాత్ర కాసేపే కనిపించింది. కానీ పండిన వైనం మాత్రం అద్భుతం. ఈ నేపథ్యంలో విశ్వంభరలో అనుష్కని ఎంపిక చేస్తే బాగుంటుందని వినిపిస్తుంది. చిరంజీవి సరసన అనుష్క కనిపిస్తే ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది.
అనుష్క ఎంట్రీ కూడా సినిమాకి మంచి బజ్ తీసుకొచ్చే అంశమే. అనుష్కకి అంటూ తెలుగులో ప్రత్యేక మైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇక చిరంజీవి ఫాలోయింగ్ చెప్పాల్సిన పనిలేదు. ఆ ఇద్దరి ఫాలోయింగ్ `విశ్వంభర` బిజినెస్ కి ఎంతో మేలు చేసేదే. `అరుంధతి`తో అనుష్క బాక్సాఫీస్ వద్ద సోలోగానే సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లని సాధించింది. ఈ నేపథ్యంలో విశ్వంభర లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో అనుష్క భాగమైతే అది సినిమాకి కలిసొచ్చేదే? అనుష్కకి సరైన కంబ్యాక్ అవుతుంది.