Begin typing your search above and press return to search.

హీరోయిన్ అవి క‌నిపిస్తే ఆగ‌లేదుట‌!

దీపికా ప‌దుకొణే..క‌రీనాకపూర్ లాంటి సీనియ‌ర్ హీరోయిన్ల స‌ర‌స‌న స్థానం సంపాదించ‌గ‌ల్గింది.

By:  Tupaki Desk   |   13 Dec 2023 4:30 PM GMT
హీరోయిన్ అవి క‌నిపిస్తే ఆగ‌లేదుట‌!
X

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ల‌లో అలియభ‌ట్ రేంజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డు సైతం కైవ‌సం చేసుకుని అలియా స‌త్తా చాటింది. అతిపిన్న వ‌య‌సులోనే జాతీయ అవార్డు అందుకుని ఓ కొత్త రికార్డును సృష్టించింది. చాలా త‌క్కువ స‌మ‌యంలో ప‌రిశ్ర‌మ‌లో అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. దీపికా ప‌దుకొణే..క‌రీనాకపూర్ లాంటి సీనియ‌ర్ హీరోయిన్ల స‌ర‌స‌న స్థానం సంపాదించ‌గ‌ల్గింది.

ఇదంతా కేవ‌లం ప్ర‌తిభ‌తోనే సాధ్య‌మైంద‌ని నిరూపించింది. ఎంతో మంది స్టార్ కిడ్స్ ఉన్నా! వాళ్లెవ్వ‌రు సాధించ‌లేనిది అలియా సాధించిందంటే? ఆమె ఎంత‌టి ప్ర‌తిభావంతురాలో అద్దంప‌డుతుంది. హాలీవుడ్ లో సైతం అవకాశాలు అందుకుంటుంది. మ‌రోవైపు నిర్మాత‌గానూ మెప్పిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఇండ స్ట్రీకి వ‌చ్చే ముందు నాటి సంగ‌తుల్ని గుర్తు చేసుకుంది. `నేను ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దివే స‌మ‌యంలో ఒక రోజు క‌ర‌ణ్ జోహార్ తో మీటింగ్ ఉన్న‌ట్లు ఫోన్ కాల్ వ‌చ్చింది.

అప్పుడు క్లాస్ రూమ్ లో ఉన్నాను. అదే యూనిఫాంతో కర‌ణ్ ఆఫీస్ కి వెళ్లాను. అప్పుడు నేను ఎక్కువ‌గా ప్రెంచ్ ప్రైస్ తీనేదాన్ని. దీంతో బొద్దుగా త‌యార‌య్యాను. ఆయ‌న న‌న్ను చూసిన వెంట‌నే ఆడిష‌న్ ఇవ్వ‌మ‌న్నారు. అప్ప‌టికి ఆడిష‌న్ అంటే ఏంటో కూడా తెలియ‌దు. నాకు తెలిసింది చేసాను. అప్పుడే నువ్వు ఎంపిక‌య్యావ‌య‌ని క‌ర‌ణ్ అన్నారు. ఆ క్ష‌ణం నా కంట క‌న్నీళ్లు ఆగ‌లేదు. ఆనందంతో ఒక క‌ప్ కేక్ తినొచ్చా? అని అడిగాను.

కేక్ లు ఎదురుగా ఉంటే చూస్తూ ఉండలేను. వాటికి ఎలా తినాలా? అని నా ఆలోచ‌న‌లు అటువైపు వెళ్లిపోతుంటాయి. ఆ విష‌యం తెలిసిన మా అమ్మ నేను సినిమాల్లో న‌టించ‌డానికి సంకోచించినా నాన్న మాత్రం ధైర్యంగా అంగీక‌రించారు' అని గుర్తు చేసుకుంది. ప్ర‌స్తుతం అలియాభ‌ట్ 'జిగ్రా' షూటింగ్లో బిజీగా ఉంది. తెలుగులో 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో అలియాభ‌ట్ ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే.