పెద్దయ్యాను కాబట్టి అడల్ట్ సినిమాలే చేస్తా: ఏక్తాకపూర్
మీరంతా ఎక్కువ మాట్లాడినందుకు నా బృందం నన్ను ట్విట్టర్ నుంచి లాక్ చేసింది. ఇప్పుడు మళ్లీ నేను ట్విట్టర్‌లోకి తిరిగి వచ్చాను..
By: Tupaki Desk | 12 Oct 2023 4:02 AM GMTసోషల్ మీడియాల్లో నెటిజనులు సూటిగా ప్రశ్నలు సంధించడంలో ఎప్పుడూ వెనకాడరు. స్వేచ్ఛగా ఈ వేదికలపై సెలబ్రిటీలతో ముచ్చటించేందుకు మొహమాటం అడ్డు రాదు. అలా ఓ రెండు ప్రశ్నలు మహిళా నిర్మాత ఏక్తా కపూర్ ని సూటిగా తాకాయి. వాటికి ఏక్తా ఇచ్చిన సమాధానాలు కూడా అంతే సింపుల్ గా సెటైరికల్ గా ఉన్నాయి.
నిర్మాత-దర్శకురాలు ఏక్తా కపూర్ అక్టోబర్ 7 (శనివారం నాడు)న ట్విట్టర్‌లోకి తిరిగి వచ్చారు. తన ట్వీట్ లో నెటిజనులకు హెచ్చరిక జారీ చేసారు. ``మీరంతా ఎక్కువ మాట్లాడినందుకు నా బృందం నన్ను ట్విట్టర్ నుంచి లాక్ చేసింది. ఇప్పుడు మళ్లీ నేను ట్విట్టర్‌లోకి తిరిగి వచ్చాను..`` అని తెలిపింది. రీఎంట్రీ సందర్భంగా ఏక్తా తన ఆన్‌లైన్ ఫాలోవర్ల కోసం `ఆస్క్ మి సెషన్ ను నిర్వహించింది. ఈ సెషన్‌లో ఇటీవల విడుదలైన తన చిత్రం `థ్యాంక్యూ ఫర్ కమింగ్` సహా పలు అంశాలపై చర్చించింది.
ఏక్తా కపూర్ అన్ని ప్రశ్నలకు పదునైన చమత్కారమైన సమాధానాలు ఇచ్చారు. ఒక ప్రశ్న ముఖ్యంగా సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. అడల్ట్ చిత్రాలను నిర్మించడం మానుకోవాలని ఓ అభిమాని ఏక్తాను అభ్యర్థించాడు. ``దయచేసి అడల్ట్ సినిమాలు తీయడం ఆపండి`` అంటూ అతడు అభ్యర్థించాడు. దానికి జవాబుగా ఏక్తా కపూర్ ఇలా అన్నారు. ``లేదు.. నేను పెద్దయ్యాను.. కాబట్టి నేను అడల్ట్ సినిమాలను తీస్తాను`` అని చెప్పింది. మరో నెటిజన్ వ్యాఖ్యానిస్తూ.. ఏక్తా కపూర్ - కరణ్ జోహార్ మొత్తం దేశంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నారని ఆరోపించారు. ``మీరు కరణ్ జోహార్ మా దేశాన్ని నాశనం చేసారు!`` అని ఆవేదన చెందాడు. దానికి ప్రతిస్పందనగా ఏక్త..`హ్మ్మ్మ్మ్మ్!` అని జవాబిచ్చారు.
మరో ట్వీట్‌లో ఏక్తా కపూర్ - కరణ్ జోహార్ భారతదేశంలో విడాకుల పెరుగుదలకు కారణమవుతున్నారని వ్యాఖ్యానించారు. ``ఆప్ దోనో కి వాజా సే ఇండియా మే జ్యాదా విడాకులు హోన్ లగే (మీ ఇద్దరి కారణంగా, భారతదేశంలో విడాకుల కేసులు పెరిగాయి) అని వ్యాఖ్యానించగా.. ప్రతిస్పందనగా, ఏక్తా కపూర్ ``హ్మ్మ్మ్మ్మ్మ్ హ్మ్మ్మ్మ్మ్మ్`` అని పునరావృతం చేసింది.
ఏక్తా కపూర్ నిర్మించిన 'థాంక్యూ ఫర్ కమింగ్' గురించి 'ఎక్స్' లో చర్చిస్తూ తన స్నేహితురాలు, దర్శకురాలు రియా కపూర్‌తో తన బంధాన్ని వ్యక్తం చేసింది. ``థాంక్యూ ఫర్ కమింగ్ అనేది పితృస్వామ్యాన్ని ఎత్తి చూపకుండానే, ముక్కు కింద కోడి వెంట్రుకతో చక్కిలిగింతలు పెట్టే ప్రయత్నం`` అని తెలిపారు. పిచ్చి క్రేజీ పార్టనర్ రియా కపూర్ తీసిన ఒక చిన్న పిచ్చి సినిమా. సినిమాపై పిచ్చి ప్రేమ లేదా అలాంటి ఒక వ్యవస్థపై అసహనంతో కూడుకున్న కోపం మాత్రమే తనకు ఉంది!!`` అని ఏక్తా ట్వీట్ చేసింది. రియాకు చెందిన `అనిల్ కపూర్ ఫిల్మ్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్`తో పాటు థ్యాంక్యూ ఫర్ కమింగ్ కోసం ఏక్తా సహ నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రానికి రియా భర్త కరణ్ బూలాని దర్శకత్వం వహించారు. భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ ప్రాజెక్ట్‌లో కుషా కపిల, డాలీ సింగ్, షిబానీ బేడీ, షెహనాజ్ గిల్, కరణ్ కుంద్రా, అనిల్ కపూర్ తదితరులు నటించారు.