ఐఫాలో ఒకే సినిమాకి 10 అవార్డులు
ఇండియన్ సినీ కళాకారులు, సాంకేతిక నిపుణులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక ఆదివారం వైభవంగా జరిగింది.
By: Tupaki Desk | 10 March 2025 5:03 PM ISTఇండియన్ సినీ కళాకారులు, సాంకేతిక నిపుణులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక ఆదివారం వైభవంగా జరిగింది. జైపూర్ వేదికగా జరిగిన ఐఫా వేడుకలో బాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు. ఈసారి సినిమా ఇండస్ట్రీకి చెందిన అవార్డులు మాత్రమే కాకుండా డిజిటల్ రంగంలోని వారికి సైతం అవార్డులను ఐఫా అందించింది. శనివారం డిజిటల్ రంగంలో ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులను అందచేసిన ఐఫా ఆదివారం సినిమా ఇండస్ట్రీకి చెందిన అవార్డులను అందించింది. ఐఫా అవార్డుల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా 'లాపతా లేడీస్' సినిమాకు ఏకంగా 10 అవార్డులు వచ్చాయి.
ఆస్కార్ అవార్డ్‌కు ఇండియా తరపున నామినేట్ కావడంతో పాటు పలు అంతర్జాతీయ వేదికలపై, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ లపాతా లేడీస్ సినిమా చోటు దక్కించుకున్న విషయం తెల్సిందే. అంతర్జాతీయ స్థాయిలో ఆ స్థాయి ఆధరణ సొంతం చేసుకున్న లాపతా లేడీస్ సినిమా ఇండియన్ ఫిల్మ్ అవార్డ్ వేడుకల్లోనూ సందడి చేసింది. తాజాగా ఐఫా 2025 అవార్డుల వేడుకలో సత్తా చాటింది. సినిమాకు వచ్చిన స్పందనకు, అవార్డులకు గాను దర్శకురాలు కిరణ్ రావు సంతోషాన్ని వ్యక్తం చేశారు. లాపతా లేడీస్ సినిమాకు సహ నిర్మాతగా అమీర్ ఖాన్ వ్యవహరించిన విషయం తెల్సిందే.
ఐఫా 2025 అవార్డుల విజేతల జాబితా :
ఉత్తమ చిత్రం : లాపతా లేడీస్
ఉత్తమ నటుడు : కార్తీక్ ఆర్యన్ (భూల్ భులయ్యా 3)
ఉత్తమ నటి : నితాన్షి గోయల్ (లాపతా లేడీస్)
ఉత్తమ దర్శకురాలు : కిరణ్ రావు (లాపతా లేడీస్)
ఉత్తమ సహాయ నటి : జాకీ బోడివాలా (షైతాన్)
ఉత్తమ సహాయ నటుడు : రవి కిషన్ (లాపతా లేడీస్)
ఉత్తమ విలన్ : రాఘవ్ జాయల్ (కిల్)
ఉత్తమ కథ : బిప్లాబ్ గోస్వామి (లాపతా లేడీస్)
ఉత్తమ నటి (తొలి పరిచయం) : ప్రతిభ (లాపతా లేడీస్)
ఉత్తమ సంగీత దర్శకుడు : రామ్ సంపత్ (లాపతా లేడీస్)
ఉత్తమ సాహిత్యం : ప్రశాంత్ పాండే (లాపతా లేడీస్)
ఉత్తమ ఎడిటింగ్ : జాబిన్ మర్చంట్ (లాపతా లేడీస్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే : స్నహా దేశాయ్ (లాపతా లేడీస్)