Begin typing your search above and press return to search.

ఇక అంతా శర్వానంద్ మాటే

టాలీవుడ్ లో మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్స్ లో యంగ్ హీరో శర్వానంద్ ఒకరు. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 March 2024 6:39 AM GMT
ఇక అంతా శర్వానంద్ మాటే
X

టాలీవుడ్ లో మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్స్ లో యంగ్ హీరో శర్వానంద్ ఒకరు. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. శర్వానంద్ నటించిన లాస్ట్ మూవీ ఒకే ఒక జీవితం బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. ఎక్స్ ప్రెస్ రాజా, రన్ రాజా రన్ లాంటి కథలు శర్వానంద్ కు బాగా సూట్ అవుతాయి. కానీ కొన్నేళ్లుగా ఆయన ఎంచుకున్న స్టోరీస్ గురి తప్పుతున్నాయి. తాజాగా శర్వా వరుస సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే.


ప్రస్తుతం చేతిలో మూడు చిత్రాలతో బిజీబిజీగా గడుపుతున్నారు శర్వానంద్. అందులో ఒకటి మనమే. ఈ సినిమాను శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన టైటిల్ అనౌన్స్మెంట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. చెప్పినట్లు నేడు ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.

ఇక నా మాటే అంటూ సాగుతున్న ఈ సాంగ్ ప్రస్తుతం మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. పాటలో శర్వానంద్ క్రేజీ షేడ్స్ తో ట్రెండీ అవతార్ లో కనిపిస్తున్నారు. స్కేటర్ రైడింగ్ చేస్తున్నట్లు స్టార్టింగ్ లో కనిపించి అలరించారు. ఆ తర్వాత ఫారిన్ అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. పాటలో శర్వానంద్ తన హుక్ స్టెప్పులతో తెగ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ సాంగ్ లో ఒక చిన్న పాప కూడా కనిపిస్తోంది.

ఇక మనమే ఫస్ట్ సింగిల్ లో బ్యాక్ గ్రౌండ్ విజువల్స్ అదిరిపోయాయి. పాట షూట్ అంతా విదేశాల్లోనే జరిగినట్లు కనిపిస్తోంది. మేకింగ్ షాట్స్ కూడా యాడ్ చేశారు మేకర్స్. ఇక ఈ సాంగ్ కు ఖుషీ ఫేమ్, మాలీవుడ్ కంపోజర్‌ హేశమ్‌ అబ్దుల్‌ వహబ్ ఇచ్చిన మ్యూజిక్ క్రేజీగా ఉంది. కచ్చితంగా ఈ పాట మరో చార్ట్ బస్టర్ అవ్వనుంది. సినిమాపై పాజిటివ్ వైబ్స్ కూడా క్రియేట్ చేస్తోంది ఈ సాంగ్.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ఏడిద రాజా అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌ గా వ్యవహరిస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ విక్రమ్ ఆదిత్య కీలక పాత్రలో నటిస్తున్నారు. విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రముఖ టెక్నీషియన్ ప్రవీణ్ పూడి ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా.. అర్జున్ కార్తీక్, ఠాగూర్, వెంకీ డైలాగ్స్ అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో శర్వానంద్ ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.