Begin typing your search above and press return to search.

జీరో నుంచి హీరోగా ఎదిగిన మ్యూజిక్ మ్యాస్ట్రో క‌థ‌!

అరుణ్ మాథేశ్వ‌రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీకరణ పురోగతిలో ఉంది.

By:  Tupaki Desk   |   2 Jun 2024 6:41 AM GMT
జీరో నుంచి హీరోగా ఎదిగిన మ్యూజిక్ మ్యాస్ట్రో క‌థ‌!
X

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా బ‌యోపిక్ `ఇళైయరాజా` పేరుతో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. లెజెండరీ న‌టుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా ఈ బ‌యోపిక్ ప్రారంభ‌మైంది. ధ‌నుష్ ఈ చిత్రంలో టైటిల్ పాత్ర‌ను పోషిస్తున్నారు. అరుణ్ మాథేశ్వ‌రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీకరణ పురోగతిలో ఉంది.

సమర్థుడైన నటుడు ధనుష్ తనదైన న‌ట‌న‌తో అనేకసార్లు నిరూపించాడు. జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అత‌డు గౌర‌వం అందుకున్నాడు. అందుకే ఇప్పుడు రాజా పాత్ర‌లో న‌టిస్తున్నాడు అన‌గానే స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఇప్ప‌టికే ఇళైయ‌రాజా ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేయ‌గా అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఇళ‌య‌రాజా హార్మోనియం పెట్టె ప‌ట్టుకుని న‌గ‌రంలో బ్యాక్ ఫీట్ లో నిలుచుని ఉన్న ఓ అంద‌మైన ఆహ్లాద‌క‌ర‌మైన ఫోటోని లాంచ్ చేయ‌గా దానికి అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. స‌రిగా రోడ్లు అయినా లేని మ‌ద్రాసు న‌గ‌రంలో అక్క‌డ‌క్క‌డా సైకిళ్లు, అంబాసిడ‌ర్ కార్లు, ప‌క్క‌పాపిడి బాబులు త‌ప్ప ఇంకెవ‌రూ ఈ పోస్ట‌ర్ లో కనిపించ‌లేదు. రాజా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించే క్ర‌మంలో ఎలాంటి పాట్లు ప‌డ్డాడో ఈ సీన్ చెబుతోంది.

ఇప్పుడు ఇళ‌య‌రాజా బ‌ర్త్ డే సంద‌ర్భంగా మ‌రో కొత్త పోస్ట‌ర్ ని లాంచ్ చేసింది చిత్ర‌బృందం. ఈసారి కూడా రాజా బ్యాక్ ఫీట్ లోనే క‌నిపించాడు. అయితే అప్ప‌టికి ఇప్ప‌టికి డెవ‌ల‌ప్ మెంట్ ని పోస్ట‌ర్ లో చూపించారు. ఇళ‌య‌రాజా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ న‌డుమ క‌నిపించాడు. చుట్టూ జ‌నం క‌మ్మేసిన ఓ కాన్సెర్ట్ షోలో వేదిక‌పై క‌నిపించాడు. అది కీబోర్డ్ లేదా హార్మోనియం త‌ర‌హా పెట్టెతో లైవ్ కాన్సెర్ట్ ని హోరెత్తిస్తూ క‌నిపించాడు. ఓవ‌రాల్ గా 80ల నాటి వాతావ‌ర‌ణాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు ఈ పోస్ట‌ర్ల‌లో చూపిస్తున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. ఇళ‌య‌రాజా ఆరంగేట్ర జీవితంలోని ఎన్నో ఒడిదుడుకులు ఉత్తాన‌ప‌త‌నాలు లేదా సాఫీగా సాగే ప్ర‌యాణం గురించి ఎవ‌రికీ తెలియ‌ని విష‌యాల‌ను తెర‌పై ఆవిష్క‌రించ‌నున్నారు. మ్యూజిక్ మ్యాస్ట్రో పాత్ర‌లో ధ‌నుష్ ఎంత‌గా ఒదిగిపోయి న‌టిస్తున్నాడో ఈ పోస్ట‌ర్లు వెల్ల‌డిస్తున్నాయి. ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న ఇళ‌య‌రాజా అభిమానుల‌ను ఈ పోస్ట‌ర్లు ఎంతో ఎగ్జ‌యిట్ చేస్తున్నాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. 2024-25 సీజ‌న్ లో మోస్ట్ అవైటెడ్ బయోపిక్ ల జాబితాలో ఇళ‌య‌రాజా బ‌యోపిక్ ఉంద‌న‌డంలో డౌట్లు అక్క‌ర్లేదు.

`కెప్టెన్ మిల్లెర్` ఫేమ్ అరుణ్ మాథేశ్వ‌రన్ ఇళ‌య‌రాజా బయోపిక్‌కు దర్శకత్వం వహిస్తుండ‌గా, ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంద‌ని స‌మ‌చారం. ఈ బయోపిక్ లో జీరో నుండి హీరోగా ఎదిగే యువ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా గురించిన క‌థ‌ను తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. సంగీతానికి పుట్టిన‌రోజు అంటూ చిత్ర‌బృందం ఈ పోస్ట‌ర్ ని లాంచ్ చేసింది. క‌నెక్ట్ మీడియా- మెర్క్యూరి మూవీస్- పీకే ప్రైమ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీరాంభ‌క్తి శ‌ర‌న్, వ‌రుణ్ మాథుర్, వీకే ప‌ద్మ‌కుమార్ నిర్మాత‌లు.