ఇళయరాజా కెరీర్ లో పెద్ద పొరపాటు ఇదే..!
రెండు తెలుగు పాటలకు ఇళయరాజా కావాలని సేమ్ ట్యూన్ ఇవ్వలేదు. తెలుగు లో వచ్చిన అభినందన పాట కోసం ఆ ట్యూన్ ను ఇచ్చాడు.
By: Tupaki Desk | 8 April 2024 5:17 AM GMTసౌత్ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకున్న సంగీత దర్శకుడు ఇళయరాజా. ఈ జనరేషన్ వారికి కాస్త తక్కువే అయినా 1980 మరియు 90 వారికి ఇళయరాజా సంగీత దేవుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
తెలుగు, తమిళ సినిమాలకు ఆయన అందించిన పాటలు దశాబ్దాలు దాటినా కూడా ఇంకా అలరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికి ఆయన పాటలు వింటూ రాత్రుల్లు గడిపేవారు ఎంతో మంది ఉంటారు. అలాంటి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా కెరీర్ లో చేసిన అతి పెద్ద పొరపాటు గురించి సోషల్ మీడియాలో మరోసారి చర్చకు వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే... ఇళయరాజా ఒక ట్యూన్ ను రెండు పాటలకు ఇచ్చాడు. అది కూడా రెండు తెలుగు సినిమాలే అవ్వడం విశేషం. అభినందన సినిమాలో ప్రేమ ఎంత మధురం పాటకు ఇళయరాజా సంగీతాన్ని అందించారు. అదే ట్యూన్ ను అన్వేషణ సినిమాకు ఇలలో.. అనే పాటకు ఇచ్చారు.
రెండు పాటల ట్యూన్ ఒక్కటే అనే విషయం చాలా రోజుల వరకు బయటకు అర్థం కాలేదు. పల్లవి ట్యూన్ మార్చి చరణం యొక్క ట్యూన్ ను 99 శాతం సేమ్ ఇచ్చినా కూడా ఇళయరాజా పాటలకు ఉన్న ఆధరణ నేపథ్యంలో ఆ సమయంలో పెద్దగా పట్టించుకోలేదు.
రెండు తెలుగు పాటలకు ఇళయరాజా కావాలని సేమ్ ట్యూన్ ఇవ్వలేదు. తెలుగు లో వచ్చిన అభినందన పాట కోసం ఆ ట్యూన్ ను ఇచ్చాడు. దాన్ని కాస్త అటు ఇటుగా మార్చి ఒక కన్నడ సినిమాకు ఇళయరాజ ఆ ట్యూన్ ను ఇవ్వాలి అనుకున్నారు. ఆ ట్యూన్ రెడీ అయిన తర్వాత వంశీ ఆ ట్యూన్ ను విన్నారు.
ఆ ట్యూన్ తన అన్వేషణ సినిమాకు కావాలని అడిగాడు. దర్శకుడు వంశీ పై ఉన్న అభిమానంతో ఇళయరాజా ఆ ట్యూన్ ను ఇచ్చేశాడు. ఇచ్చే సమయంలో దాన్ని అభినందన సినిమా కు వాడిన విషయాన్ని మర్చి పోయాడు. అలా ఒకే ట్యూన్ ను రెండు తెలుగు సినిమాల పాటలకు ఇచ్చాడు.
ఇప్పుడు అయితే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ వచ్చేవి. ఆ రోజుల్లో కనుక ఇళయరాజా కాపీ అంటూ ముద్ర లేకుండానే బయట పడ్డాడు. ఎన్నో గొప్ప పాటలు అందించిన ఆయన కెరీర్ లో జరిగిన పొరపాటు ఇదే అన్నట్లుగా ఆయన సన్నిహితులు మాట్లాడుకుంటూ ఉంటారు.