కాపీ చేసిన వారికి ఇళయరాజా నేర్పిన గుణపాఠం
గడిచిన రెండేళ్లుగా మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా పేరు మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది.
By: Tupaki Desk | 5 Aug 2024 5:54 AM GMTగడిచిన రెండేళ్లుగా మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా పేరు మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఆయన తన క్లాసిక్స్ నుంచి కాపీ కొడుతున్నవారిని విడిచిపెట్టడం లేదు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించగా, రాజా సంగీతం అందించిన `గుణ` సినిమాలోని `కణ్మణి అన్బోడు కాధలన్` అనే ఐకానిక్ పాటను ఇటీవలి మలయాళ బ్లాక్ బస్టర్ `మాంజుమ్మెల్ బాయ్స్` కోసం అనధికారికంగా ఉపయోగించుకోవడంతో దీనిపై రాజా కోర్టుకు వెళ్లారు. కొంతకాలంగా ఈ కేసులో విచారణ జరుగుతోంది.
కన్మణి అన్బోడు కాధలన్ పాట ఒరిజినల్ సృష్టికర్త ఇళయరాజా తన నుంచి `మంజుమ్మెల్ బాయ్స్` నిర్మాతలు హక్కులను పొందనందుకు, తన నుంచి ఎన్‌ఓసిని పొందనందుకు నష్టపరిహారం డిమాండ్ చేస్తూ మేకర్స్‌పై లీగల్ నోటీసును జారీ చేశారు. నోటీసు అందుకున్న తర్వాత మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాతలు ఇళయరాజాను వ్యక్తిగతంగా కలిశారు. సినిమా సక్సెస్‌ను దృష్టిలో ఉంచుకుని ఇళయరాజా పరిహారంగా రూ.2 కోట్లు డిమాండ్ చేశాడు. చివరకు రూ.60 లక్షలకు ఒప్పందం జరిగిందని తెలిసింది.
మంజుమ్మెల్ బాయ్స్ మేకర్స్ ఆ మొత్తాన్ని చెల్లించి న్యాయపరమైన సమస్యను పరిష్కరించుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి యువతరం ఫిలింమేకర్స్ తో రాజా ఘర్షణ చాలా మందికి నచ్చలేదు. ఆయనపై ట్రోలింగ్ చేసారు. కానీ న్యాయం అనేది ఒకటి ఉంటుందని కోర్టుల పరిధిలో నిరూపణ అయింది. ఎట్టకేలకు మంజుమ్మెల్ బాయ్స్ టీమ్‌పై ఇళయరాజా విజయం సాధించారు. నిర్మాతలు పట్టు విడుపు ఆలోచించి తెలివిగా ఈ సమస్యను పరిష్కరించుకోవడం విశేషం. ఇది ఔత్సాహిక ఫిలింమేకర్స్ కి ఒక గుణపాఠం.