ఇళయరాజా కుమార్తె కన్నుమూత
గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధికి శ్రీలంకలో చికిత్స తీసు కుంటోన్న భవతరణి ఆరోగ్యం విషమించి ఈరోజు సాయంత్రం కన్ను మూసినట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 25 Jan 2024 4:10 PM GMTకోలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకులు..మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా కుమార్తె భవతరణి (47) మరణించారు. గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధికి శ్రీలంకలో చికిత్స తీసు కుంటోన్న భవతరణి ఆరోగ్యం విషమించి ఈరోజు సాయంత్రం కన్ను మూసినట్లు తెలుస్తోంది. దీంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
దీంతో సోషల్ మీడియా వేదికగా సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆమె భౌతిక కాయాన్ని రేపటి లోగా చెన్నైకి తరలించి అత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. భవతరణి ఎన్నో మధురమైన పాటలతో శ్రోత్నలి అలరించారు. తన తండ్రి సంగీతం అందించిన ఎన్నో సినిమాల్లో ఆమె ఆలపించారు. గాయనిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు.
అలాగే భవతరణి కొన్ని సినిమాలకు సంగీత దర్శకురాలిగానూ పనిచేసారు. `మైప్రెండ్` అనే సినిమాతో సంగీత దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత అవునా అనే తెలుగు సినిమాకి సంగీతం అందిం చారు. ఇంకా మరికొన్ని తమిళ సినిమాలకు బాణీలు సమకూర్చారు. ఓ వైపు సొంతంగా సంగీతం అంది స్తూనే ఆవే చిత్రాల్లోనూ పాటలు పాడారు.
తండ్రీ సంగీత దర్శకత్వంలో తొలిసారి 1984 లో గాయనిగా పరిచమయ్యారు.` మైడియర్ కుట్టిచాతన్` అనే సినిమాలో తొలిసారి ఆలపించారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల కోసం పాటలు పాడారు. 2014 వరకూ సింగర్ గాను..2019 వరకూ సంగీత దర్శకురాలిగానూ కొనసాగారు.