Begin typing your search above and press return to search.

న్యూ ఇయర్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన ఇల్లి బేబ్..!

మైఖెల్ తో పాటు తన బాబుతో ఫుల్ టైం కేటాయిస్తున్న ఇలియానా 2024 లో జరిగిన విశేషాలతో ఒక స్పెషల్ వీడియో చేసింది.

By:  Tupaki Desk   |   1 Jan 2025 9:30 PM GMT
న్యూ ఇయర్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన ఇల్లి బేబ్..!
X

గోవా బ్యూటీ ఇలియానా న్యూ ఇయర్ నాడు ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. తన బోయ్ ఫ్రెండ్ మైఖేల్ ని పెళ్లాడిన అమ్మడు ఒక బాబుతో ఎంచక్కా హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. అంతకుముందు తన ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని ఆకట్టుకునే అమ్మడు ఈమధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండట్లేదు. ఐతే అందుకు కారణం ఏంటన్నది ఆమె బయట పెట్టింది. మైఖెల్ తో పాటు తన బాబుతో ఫుల్ టైం కేటాయిస్తున్న ఇలియానా 2024 లో జరిగిన విశేషాలతో ఒక స్పెషల్ వీడియో చేసింది. ఆ వీడియోలో అమ్మడు రెండోసారి ప్రెగ్నెన్సీ అయిన విషయాన్ని వెల్లడించింది.

ఇలియానా రెండోసారి తల్లి కాబోతుందని తెలిసి ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. హీరోయిన్ గా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టిన ఇల్లి బేబ్ కొన్నాళ్లు సోలోగానే కనిపించింది. ఐతే మైఖెల్ తో ప్రేమాయణం సాగించి పెళ్లికి ముందే తల్లైంది. బాబు పుట్టాక పెళ్లి చేసుకున్న ఇలియానా మళ్లీ ఇప్పుడు రెండోసారి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఆమె 2024 డైరీ స్పెషల్ వీడియోలో చెప్పుకొచ్చింది.

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపేసింది ఇలియానా. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో అమ్మడు కలిసి నటించింది. అంతేకాదు సౌత్ లో వచ్చిన క్రేజ్ తోనే బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. ఐతే అక్కడ మాత్రం ఇలియానాకు ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాలేదు. సౌత్ సినిమాల కన్నా బాలీవుడ్ లో గ్లామర్ షోలో కూడా రెచ్చిపోయినా కూడా అమ్మడికి కాలం కలిసి రాలేదు. ఐతే మళ్లీ సౌత్ సినిమాల్లో ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయింది.

15 ఏళ్ల క్రితం ఇలియానా టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ క్రేజీ ఫ్యాన్స్ ని ఏర్పరచుకుంది. ఐతే తెలుగులో స్టార్ ఇమేజ్ ఉన్న టైం లో బాలీవుడ్ ఆఫర్ రాగానే అక్కడకి చెక్కేయడంతో ఇక్కడ మేకర్స్ హర్ట్ అవ్వడంతో తిరిగి ఛాన్స్ ల కోసం వచ్చినా అమ్మడిని పట్టించుకోలేదు. ఐతే ఇలియానా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఇలా అడపాదడపా సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఐతే ఇలియానా ప్రెగ్నెన్సీ వార్త విన్న అమ్మడి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక సైలెంట్ గా ఉన్నారు.