ఇలియానా భర్త..బిడ్డకి తండ్రి ఇతనే!
బిడ్డకు తండ్రి ఎవరో చెప్పమని ప్రశ్నించినా ఇన్నాళ్లు దానికి సమాధానం చెప్పకుండా స్కిప్ కొట్టింది.
By: Tupaki Desk | 25 Nov 2023 7:47 AM GMTపెళ్లి కాకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చి ఇలియానా ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. అమీజాక్సన్ తర్వాత ఆ రికార్డు తనకే సొంతమని ప్రూవ్ చేసింది. అమీజాక్సన్ విదేశీ నటి కాబట్టి అక్కడ కల్చర్ ప్రకారం అలా చేసిందని సర్దుకున్నారు. కానీ ఇండియాలో పుట్టిన ఇలియానికి ఇలాంటి ఐడియాలో ఎలా వస్తాయంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కుంది. బిడ్డకు తండ్రి ఎవరో చెప్పమని ప్రశ్నించినా ఇన్నాళ్లు దానికి సమాధానం చెప్పకుండా స్కిప్ కొట్టింది.
కేవలం బిడ్డ ఫోటోని మాత్రమే చూసి సంబర పండండి..భర్త వివరాలు ఎందుకంటూ మౌనం వహించింది. కానీ ఇంతకాలం మౌనంగా ఉన్నా ఇప్పుడు ఓపెన్ కాక తప్పలేదు. సోషల్ మీడియాలో అభిమానులతో ఇంటరాక్ట్ అయిన అమ్మడు భర్త ఎవరో చెప్పేసింది. గతంలో `డేట్ నైట్` అంటూ ఓ వ్యక్తితో ఉన్న ఫోటోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే. కానీ అతనే నా భర్త అని చెప్పలేదు.
దీంతో అతను ఎవరు? ఇలియానా పక్కన ఎందుకంత క్లోజ్ గా ఉన్నాడు? అని కొత్త సందేహం మొదలైంది. ఇతను స్నేహితుడా? భర్త అని రకరకాల సందేహాలు తెరపైకి వచ్చాయి. తాజాగా వాటన్నింటకి తెర దించుతూ అతనే నాభర్త అని ప్రకటించింది. మీ సింగిల్ పేరెంటింగ్ ఎలా ఉంది? అంటే నేను సింగిల్ కాదు.. నా కుమారుడు తండ్రి ఇతడే అని చెప్పింది. కానీ అతడి వివరాలు మాత్రం ఇంకా గోప్యంగానే ఉంచింది.
అతని పేరు ఏంటి? ఏం చేస్తాడు? విదేశీయుడా? స్వదేశీయుడా? అని ఇలా కొత్త కన్ ప్యూజన్ లో పడేసింది. ఆ సంగతి ఎలా ఉన్నా! బిడ్డకి తండ్రి అతనని చెప్పి విమర్శల నుంచి అయితే తప్పించు కోగల్గింది. త్వరలోనే మళ్లీ సినిమాలతో బిజీ అవుతానని..ప్రస్తుతం అమ్మ ప్రేమను పొందుతు న్నానని...కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాని తెలిపింది.