Begin typing your search above and press return to search.

ఇల్లి బేబ్ గట్టిగా ట్రై చేస్తుంది కానీ..?

బర్ఫీ సినిమాతో హిందీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన అమ్మడు ఆ సినిమా తో అక్కడ చాలా హోప్స్ పెట్టుకుంది.

By:  Tupaki Desk   |   6 July 2024 1:30 AM GMT
ఇల్లి బేబ్ గట్టిగా ట్రై చేస్తుంది కానీ..?
X

తెలుగులో దేవదాస్ సినిమాతో పరిచయమై సూపర్ స్టార్ మహేష్ తో పోకిరి తో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న గోవా బ్యూటీ ఇలియానా తన స్టార్ డం ని కొన్నాళ్ల వరకే పరిమితం చేసుకుంది. తెలుగుతో పాటుగా తమిళ సినిమాల్లో కూడా నటించిన అమ్మడు అక్కడ కూడా అదరగొట్టేసింది. ఐతే తెలుగులో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఇలియానా బాలీవుడ్ బాట పట్టింది. బర్ఫీ సినిమాతో హిందీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన అమ్మడు ఆ సినిమా తో అక్కడ చాలా హోప్స్ పెట్టుకుంది. అంతేకాదు హిందీ సినిమాల కోసం సౌత్ సినిమాలను నెగ్లెక్ట్ చేసింది.

ఫలితంగా అమ్మడు అక్కడ స్టార్ రేంజ్ అందుకోలేదు సరికదా సౌత్ సినిమా ఆఫర్లను మిస్ చేసుకుంది. ఐతే తిరిగి మళ్లీ తెలుగు ఆఫర్ల కోసం ప్రయత్నించినా వర్క్ అవుట్ కాలేదు. ఇక సినిమాల్లో ఎలాగు కెరీర్ బాగా లేదని క్లారిటీకి రావడంతో ఆస్ట్రేలియా ఫోటో గ్రాఫర్ తో డేటింగ్ చేసింది. ఐతే అతన్ని పెళ్లాడుతుందని అనుకోగా అతనికి దూరమైంది. అతను వెళ్లాడా లేదా ఇలియానానే అతన్ని దూరం చేసుకుందా అన్నది తెలియదు కానీ ఇల్లి బేబీ మళ్లీ ఒంటరిదైంది.

ఐతే అలా కొన్నాళ్లే ఉన్న అమ్మడు మళ్లీ తన తోడుని వెతుక్కుంది. మైఖెల్ డోలన్ తో కొన్నాళ్లు డేటింగ్ చేసిన ఇలియానా అతనితో ఒక బాబుని కూడా కనేసింది. ఇదిలా ఉంటే ఇలియానా మళ్లీ తిరిగి సినిమాల్లోకి రావాలని చూస్తుంది. తనకు స్టార్ డం తెచ్చిన తెలుగు పరిశ్రమ మీదే అమ్మడు గురి పెట్టుకుని కూర్చుకుంది. తనకు అవకాశం ఇవ్వాలని గట్టిగా ట్రై చేస్తుంది ఇలియానా. మొన్నటిదాకా సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ ని అలరించిన అమ్మడు ఇప్పుడు అదే క్రేజ్ తో సినిమా ఛాన్సులు అందుకోవాలని చూస్తుంది.

ఇలియానా చివరగా తెలుగులో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించింది. ఆ తర్వాత ఒక్కరంటే ఒక్కరు కూడా ఆమెను తీసుకోలేదు. ఐతే బాలీవుడ్ లో మాత్రం అరకొర అవకాశాలతో కెరీర్ వెళ్లదీస్తుంది. తెలుగులో ఇల్లి బేబ్ కి క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. ఐతే ఏదైనా సినిమా ఛాన్స్ వస్తే మాత్రం నో లిమిట్స్ అనే రేంజ్ లో అందాల ప్రదర్శనకు సిద్ధం అవుతుంది అమ్మడు. ఏం చేసైనా సరే తెలుగులో మళ్లీ బిజీ అవ్వాలని చూస్తుంది ఇలియానా. మరి అమ్మడిని ఎవరైనా పట్టించుకుంటారా లేదా అన్నది చూడాలి.